Telangana | Godavari pushkaralu | maharastra | KCR | Devendra Fadnavis

Maharastra cm devendra fadnavis said that there no water to release for telangana godavari pushkaralu

Telangana, Godavari pushkaralu, maharastra, KCR, Devendra Fadnavis

Maharastra cm Devendra Fadnavis said that there no water to release for telangana godavari pushkaralu. KCR request to release the water on the occassion of Godavari pushkaralu.

తెలంగాణ గోదావరి పుష్కరాలకు నీటి కటకట

Posted: 07/14/2015 08:26 AM IST
Maharastra cm devendra fadnavis said that there no water to release for telangana godavari pushkaralu

తెలంగాణలో గోదావరి పుష్కరాలకు నీటిని వదిలే పరిస్థితి లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తెలిపారు. కేంద్రపట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడుకు సోమవారం ఆయన ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పారు. నీరు వదలాల్సిందిగా ఇటీవల ఫడ్నవీస్‌కు ఆయన చెప్పిన నేపథ్యంలో ఫడ్నవీస్‌ ఫోన్‌ చేశారు. నీరు వదలాల్సిన చోట తగిన నిల్వ లేదని అందువల్ల తాము ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నదని ఫడ్నవీస్‌ నిస్సహాయత వ్యక్తం చేశారు. పుష్కరాలు పూర్తయ్యే లోపు తగిన నిల్వ లభిస్తే జలాలను విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో తెలంగాణ పరిధిలోని చిన్న రిజర్వాయర్లలో ఉన్న కొద్దిపాటి నీటినే రాష్ట్ర ప్రభుత్వం పుష్కరఘాట్లకు మళ్లిస్తోంది.

Also Read:  మా తల్లి గోదారి పిలుస్తోంది.. పుష్కరాలొచ్చె సంబరాలు తెచ్చె

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి రోజూ 3వేల క్యూసెక్కుల చొప్పున పుష్కరాలు పూర్తయ్యేంత వరకు 6 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం రెండు గేట్లు ఎత్తి ఐదు వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. తద్వారా ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ మండలం సోన్‌ నుంచి మంచిర్యాల సమీపంలోని గూడెం వరకు గల 32 స్నానఘట్టాల వద్ద, నిజామాబాద్‌ జిల్లా పోచంపాడ్‌లోని నాలుగు ఘాట్లు, సావెల్‌, తడపాకల్‌, గుమ్మిర్యాల, దోంచంద పుష్కర ఘాట్ల వద్ద నీరు వచ్చింది. కడెం ప్రాజెక్టు నుంచి ఆరు వేల క్యూసెక్కులను విడుదల చేశారు. ఎల్లంపల్లి నుంచీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. పుణ్యక్షేత్రమైన బాసరలోను, గోదావరి, మంజీర, హంద్రీ నదుల త్రివేణీ సంగమస్థలి అయిన నిజామాబాద్‌ జిల్లా కుందకుర్తిలోను గోదావరి నీరు లేక బోసిపోతోంది. కరీంనగర్‌ జిల్లా ధర్మపురి, కాళేశ్వరం, కోటిలింగాల, నిజామాబాద్‌ జిల్లా పోచంపాడు, ఖమ్మం జిల్లా భద్రాచలం, ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల, గూడెం, సోన్‌ ప్రాంతాల్లో నీరు పుష్కలంగా ఉంది.

By Abhinavachary

Also Read: వైభవంగా ప్రారంభమైన గోదారి పుష్కరాలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Godavari pushkaralu  maharastra  KCR  Devendra Fadnavis  

Other Articles