Surcharge | Godavari pushkaralu | Telangana | BJP | KCR | Sambashivarao, apsrtc, tsrtc, chandrababu

Ap govt cancel the surcharge on godavari pushkara buses

Surcharge, Godavari pushkaralu, Telangana, ap, BJP, KCR, Sambashivarao, apsrtc, tsrtc, chandrababu

AP govt cancel the surcharge on Godavari pushkara buses. but telangana govt didnt cancel the surcharge.

ఏపిలో ఎత్తేశారు.. కానీ తెలంగాణలో మాత్రం బాదుతున్నారు

Posted: 07/14/2015 08:37 AM IST
Ap govt cancel the surcharge on godavari pushkara buses

ఆపసోపాలు పడైనా సరే పుష్కరాలకు వెళ్లి పుష్కర స్నానం చెయ్యాలని అనుకున్న భక్తులకు రెండు తెలుగు రాష్ట్రాలు సర్ ఛార్జీల మోత మోగిస్తున్నాయి. అయితే సర్వత్రా సర్ ఛార్జీల మీద నిరసన వ్యక్తం కావడంతో ఏపి సర్కార్ ర్ చార్జీలపై వెనక్కి తగ్గింది. పుష్కరాల కోసం ప్రత్యేకంగా నడుపుతున్న బస్సులలో అవనపు చార్జీలను వసూలు చేయకూడదని ఏపి ప్రభుత్వం నిర్ణయించడం భక్తులకు ఊరటనిస్తోంది. ఏపి ప్రభుత్వం నిర్ణయాన్ని ఏపీఎస్ఆర్టిసి ఎండి సాంబశివరావు వెల్లడించారు.  ప్రయాణికుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో అదనపు చార్జీలు వసూలు చేయవద్దని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలనే వసూలు చేయనున్నట్లు ఎండీ ప్రకటించారు.

Also Read: తెలంగాణ పుష్కరాలకు నీటి కటకట

కాగా తెలంగాణలో మాత్రం పుష్కర భక్తులపై అదనపు ఛార్జీల బాదుడు కొనసాగుతోంది.  ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేయాలని టీఎస్ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం హిందువుల మనోభాలను దెబ్బతీస్తోందని,  పుష్కరాల బస్సుల్లో సర్‌ చార్జీల పేరుతో దోపిడీకి పాల్పడుతోందని, తెలంగాణ ప్రభుత్వం  హిందూ పండుగలంటే వివక్ష చూపుతోంది అని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీసీ బస్సుల్లో సర్‌చార్జీ వసూలుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్‌ భవన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. రంజాన్‌ పండుగకు కోట్లాది రూపాయలు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం పుష్కారాలకు ఏర్పాటు చేసిన బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం లౌకిక విధానమా అని ఎమ్మెల్సీ రామచంద్రరావు  ప్రశ్నించారు. ఒక వర్గం వారికి రాయితీ ఇచ్చి, మరో వర్గంపై భారం మోపడం ఏమిటని ప్రశ్నించారు. నేటి నుండి ప్రారంభమైన గోదావరి పుష్కరాలు ఈ నెల 25 వరకు కొనసాగుతాయి.

 

Also Read: మా తల్లి గోదారి పిలుస్తోెంది

Also Read: వైభవంగా ప్రారంభమైన గోదావరి పుష్కరాలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surcharge  Godavari pushkaralu  Telangana  ap  BJP  KCR  Sambashivarao  apsrtc  tsrtc  chandrababu  

Other Articles