Godavari pushkaralu | Bhadrachalam | Rajamandry | KCR, Chandrababu naidu

Godavari pushkaralu started this morning by chandrababu naidu and kcr

Godavari pushkaralu, Bhadrachalam, Rajamandry, KCR, Chandrababu naidu

Godavari Pushkaralu started this morning by chandrababu naidu and kcr. Chandrababu started pushkaralu in Rajamandry and kcr started in Bhadrachalam.

ITEMVIDEOS: వైభవంగా ప్రారంభమైన గోదారి పుష్కరాలు

Posted: 07/14/2015 07:33 AM IST
Godavari pushkaralu started this morning by chandrababu naidu and kcr

బృహస్పతి సింహరాశిలో ప్రవేశించిన పుణ్య సమయంలో సరిగ్గా ఈ ఉదయం 6.26 గంటలకు గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో బాసర నుంచి భద్రాచలం దాకా గోదావరి పొడవునా పలు క్షేత్రాల్లో ఏర్పాటైన 106 పుష్కర ఘాట్లు భక్తులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సతీ సమేతంగా పుష్కరాలను ఆరంభించారు. స్నానం ఆచరించి అర్ఘ్యం సమర్పించారు. రాజమండ్రిలోని సరస్వతీఘాట్‌లో సీఎం చంద్రబాబు సతీసమేతంగా పుష్కర స్నానమాచరించి అధికారికంగా ప్రారంభించారు. కొవ్వూరు, నరసాపురంలలో కంచి కామకోటి పీఠాధిపతులు, కుర్తాళం పీఠాధిపతులు శాస్తోక్తంగా పూజలు నిర్వహించి, గోదావరి హారతి ఇచ్చిన అనంతరం పుష్కర ఘట్టం ప్రారంభమైంది. గోదావరి నీటిమట్టం తగ్గడంతో సీలేరు నుంచి 6వేల క్యూసెక్కులు విడుదల చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Also Read:  మా తల్లి గోదారి పిలుస్తోంది.. పుష్కరాలొచ్చె సంబరాలు తెచ్చె

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లా ధర్మపురిలో ఈ ఉదయం 6.21 గంటలకు పుష్కర స్నానం ఆచరించి వేడుకలను ఆరంభించారు. కేసీఆర్‌తోపాటు... పుష్పగిరి, మంత్రాలయం, శ్రీశైలం, శ్రీమఠం, హంపి, తొగుట, శారదా పీఠాధిపతులు కూడా ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌ సతీసమేతంగా తెల్లవారుజామున 5 గంటలకు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దేవాలయం వద్దకు చేరుకుని స్వామి వారి నిత్య పూజల తర్వాత పుష్కర ప్రారంభానికి స్వామివారి ఆజ్ఞ తీసుకుకున్నారు అక్కడి నుంచి... పూర్ణకుంభంతో దేవాలయం నుంచి గోదావరి నదీ తీరం వరకు శోభాయాత్రగా బయలుదేరారు ఏడుగురు పీఠాధిపతులు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అర్చకులతో కలిసి గోదావరి తీరం వరకు వెళ్లారు. అక్కడ గోదావరి మాతకు, పుష్కరుణికి పూజలు చేసిన అనంతరం మహా సంకల్పం చెప్పి 6:21 గంటలకు పుణ్య స్నానాలు ఆచరించారు.

కరీంనగర్‌ జిల్లాలోనే ఉన్న త్రివేణీ సంగమం శ్రీకాళేశ్వర ముక్తేశ్వర సన్నిధిలో రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్‌, జూపల్లి కృష్ణారావు, పద్మారావు, శ్రీనివాస్‌ యాదవ్‌ పుష్కరాలను ప్రారంభించారు. సరస్వతీ దేవి కొలువైన బాసర క్షేత్రంలో మంత్రులు కేటీఆర్‌, జోగు రామన్న పుష్కరాలను ప్రారంభించారు. పన్నెండు వసంతాలకోసారి వచ్చే పుష్కర పుణ్యాన్ని దక్కించుకొనేందుకు దేశం నలుమూలల నుంచి గోదారి తీరానికి భక్త జనం పోటెత్తారు. మరో వైపు పుష్కరాలకు 1600 కోట్లతో ఏపీ సర్కార్‌ భారీ ఏర్పాట్లు చేసింది. ఉభయగోదావరి జిల్లాల్లో 162 పుష్కరఘాట్లు భక్తులకు ఆహ్వానం పలుకుతున్నాయి. రోజుకి 25 లక్షల మంది చొప్పున మొత్తం 3 కోట్ల మంది పుష్కరస్నానమాచరిస్తారని అంచనా. దాదాపు 70వేల మంది వివిధ శాఖల సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. కాగా, తెలంగాణ నుంచి గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులను అతిథి మర్యాదలతో ఆదరించాలని మంత్రి అయ్యన్నపాత్రుడు గోదావరి జిల్లావాసులకు పిలుపునిచ్చారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ బుధవారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో ఉదయం 8 గంటలకు పుష్కర స్నానం చేస్తారు.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Godavari pushkaralu  Bhadrachalam  Rajamandry  KCR  Chandrababu naidu  

Other Articles