Scientist found in their latest researches diabetes medicine metformine increase life span | Health tips

Scientist found diabetes medicine metformine increase life span

metformine medicine, diabetes medicines, life span increase medicines, life span increase, life span medicines, healthy medicines, health tips, life span researches, metformince benefits, diabetes tips

Scientist found diabetes medicine metformine increase life span : Scientist found in their latest researches that diabetes medicine metformine will increase the life span.

వృద్ధాప్యానికి చెక్ పెట్టే డయాబెటిక్ మాత్ర!

Posted: 07/13/2015 06:30 PM IST
Scientist found diabetes medicine metformine increase life span

వృద్ధాప్యానికి చెక్ పెట్టి నిత్యం యవ్వనంలా వుండాలనుకుంటున్నారా..? జీవితాన్ని మరికొన్నాళ్లపాటు ఎక్కువగా ఆస్వాదించాలనుకుంటున్నారా..? అయితే ఎందుకు ఆలస్యం.. వెంటనే డయాబెటిక్ (మధుమేహం) పేషెంట్లు వాడే ‘మెట్ ఫార్మిన్’ మాత్రలు తీసుకుంటే చాలని శాస్త్రజ్ఙులు అంటున్నారు. ప్రస్తుతం జీవన విధానాల్లో వచ్చిన మార్పు, కాలుష్య వాతావరణ ప్రభావం వల్ల మానవుని ఆయుష్షు 100 నుంచి 60 ఏళ్లకు పడిపోయింది. దీంతో కొందరు శాస్త్రజ్ఞులు ఆయుష్షును పెంచే విధానాన్ని కనుగొనే నేపథ్యంలో వివిధ రకాల పరిశోధనలు చేపట్టారు. ఈ పరిశోధనల్లో భాగంగానే.. తాజాగా డయాబెటిక్ మాత్రతో ఆయుష్షు పెరుగుతుందని నిపుణులు కనుగొన్నారు.

న్యూయార్క్ లోని కార్డిఫ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ప్రకారం.. ‘మెట్ ఫార్మిన్’ మాత్రలు తీసుకునే వారి ఆయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం గడిపే వారికంటే 15 శాతం ఎక్కువని గుర్తించారు. శరీరంలోని కణజాల మార్పులను, జీవక్రియను ‘మెట్ ఫార్మిన్’ మెడిసిన్ ప్రభావితం చేస్తుందని శాస్త్రజ్ఞులు వారి అధ్యయనంలో గుర్తించారు. దీంతో.. ఆ మాత్రలను సమయానుకూలంగా తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందని వారు వెల్లడిస్తున్నారు. ఆయుష్షు పెరుగుతుంది కదా అని మోతాదుకు మించి ఎక్కువ వేసుకుంటే మాత్రం.. అంతే సంగతులు! కాబట్టి.. వైద్యులు ఇచ్చిన సూచనల మేరకే ఈ మాత్రలను వేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని, వృద్ధాప్యానికి చెక్ పెట్టి జీవితాన్ని మరికొన్నాళ్లపాటు ఆస్వాదించవచ్చునని నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఈ అధ్యయనంలో ఈ విధంగా ఫలితం వెల్లడైన నేపథ్యంలో ఆ శాస్త్రజ్ఞులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వారు మరో ప్రయోగాన్ని చేపట్టనున్నారని సమాచారం. తాము చేపట్టనున్న కొత్త ప్రయోగంలో.. ఆయుష్షును పెంచే మార్గాలు ఇంకేమైనా వున్నాయా? ఆ మెక్ ఫార్మిన్ మెడిసిన్స్ ఎంతవరకు సహకరిస్తాయి? అన్న అంశాలతోపాటు మరిన్ని వివరాలు సేకరించనున్నట్లు శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : metformine medicine  diabetes medicines  life span increase  

Other Articles