Jupalli | Ravu | TDP | Mahabubnagar | Palaamur, Koilsagar

Jupali challenge the tdp leader ravula chandrashekar to discuss about the mahabubnagar projects

Jupalli, Ravula, TDP, Mahabubnagar, Palaamur, Koilsagar

Jupali challenge the TDP Leader Ravula Chandrashekar to discuss about the Mahabubnagar projects.

ITEMVIDEOS: రావులా రావా..? ..జూపల్లి Vs రావుల

Posted: 07/13/2015 03:39 PM IST
Jupali challenge the tdp leader ravula chandrashekar to discuss about the mahabubnagar projects

పాలమూరు ప్రాజెక్టుల మీద తెలుగుదేశం పార్టీ, తెరాస పార్టీ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఢీ అంటే ఢీ అంటూ రెండు పార్టీల నేతలు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. పాలమూరు  రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నాయుడు అడ్డుపుల్ల వేస్తున్నారని, ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా లేఖ రాశారని తెరాస నేతలు మండిపడ్డారు. అందుకు నిరసనగా పాలమూరు బంద్ ను కూడా నిర్వహించారు. అయితే పాలమూరుకు చంద్రబాబు చేసిందేమీ లేదని తెరాస నేతలు అన్న మాటల మీద తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ లు వ్యతిరేకించారు. అయితే పాలమూరు పథకాల మీద, వాటికి చేసిన ఖర్చు మీద చర్చించడానికి సిద్దంగా ఉన్నామని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.

Also Read:  సవాల్ కు సిద్దమా..? ముక్కు నేలకు రాస్తారా..? జూపల్లి

ఈ ఉదయం అసెంబ్లీ హాల్ లో చర్చించడానికి మం్రతి జూపల్లి కృష్ఱారావుతో పాటు మరో మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్లు చేరుకున్నారు. అయితే చర్చకు తాను సిద్దంగా ఉన్నానని, అసెంబ్లీ వద్దకు రావాలని జూపల్లి సవాల్ విసిరారు. అయితే జూపల్లి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారని సమాచారం అందుకున్న రావుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రి జూపల్లి ఎందుకంత ఆవేశం పడుతున్నారో తనకు అర్థం కావడం లేదని ఆయన కౌంటర్ ఇచ్చారు. పాలమూరులో ప్రాజెక్టుల విషయంలో మంత్రి జూపల్లితో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. అయితే తేదీ, సమయంపై జూపల్లి కృష్ణారావు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని రావుల విమర్శించారు. నెట్టెంపాడుకు చంద్రబాబునాయుడు హయాంలోనే అనుమతులు వచ్చాయని, కోయల్ సాగర్ ప్రాజెక్ట్ కు 2000 సంవత్సరంలో ఆదేశాలిచ్చారని రావుల గుర్తు చేశారు.

Also Read:  టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే: జూపల్లి

మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు నిధులు వెచ్చించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారని, అవి అవాస్తవం అని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి జూపల్లి ఆదివారం లేఖ రాసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ కమిటీ హాల్ లో ఈ నెల 13,15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంటానని ఆయన ఆ లేఖలో వెల్లడించారు. అన్నట్టుగానే మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ అసెంబ్లీ వద్ద టీడీపీ నేతల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు పాలమూరు ఎత్తిపోతల పథకంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై చర్చకు రావాలని తెలంగాణ టీడీపీ నేతలు విసిరిన సవాల్ కు కట్టుబడి ఉన్నానని మంత్రి తెలిపారు.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jupalli  Ravula  TDP  Mahabubnagar  Palaamur  Koilsagar  

Other Articles