Janasena President Pawan Kalyan Got Offer From Cpi Rama Krishna | Ap Special Status | Ap Controversies

Pawan kalyan got offer from cpi rama krishna special status ap controversies

pawan kalyan, cpi ramakrishna, ap special status, bjp party, chandrababu naidu, andhra pradesh state, ap capital amaravat, pawan kalyan twitter, pawan kalyan latest press meet, pawan kalyan beard photos, pawan kalyan beard

Pawan Kalyan Got Offer From Cpi Rama Krishna Special Status Ap Controversies : Cpi Rama Krishna Calls Pawan Kalyan To Join With Communist and Protest for Ap Special Status.

‘పవన్’ని రారమ్మంటున్న ఆ పార్టీ..

Posted: 07/13/2015 03:36 PM IST
Pawan kalyan got offer from cpi rama krishna special status ap controversies

రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫాలోయింగ్ ఎంతమేర వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అన్నిరంగాల్లోనూ ఆయనకు వీరాభిమానులు వున్నారు. ఆ అభిమానమే ఈయన్ను రాజకీయ రంగంవైపు అడుగులు వేయడంలో దోహదపడింది. తనను ఎంతగానో అభిమానించిన ప్రజల సంక్షేమం కోసం ఏమైనా చేయాలనే ఆకాంక్షతో ఆయన రాజకీయంలో అరంగేట్రం చేశారు. తొలుత బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతుగా నిలిచిన పవన్.. ఇప్పుడు ‘జనసేన’ పార్టీ అధ్యక్షుడిగా ఒంటరి పోరాటం కొనసాగిస్తున్నాడు. రాష్ట్రాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై గళమెత్తి ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా పోరాటం కొనసాగించిన ఈయన్ను తమ పార్టీలో ద్వారా గళమెత్తిస్తే.. పార్టీకి మంచి పేరొస్తుందని భావించినట్లుంది ‘సీపీఐ’! అందుకే.. ఆయన్ను రారమ్మంటూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుస్తున్నారు.

ప్రజాసమస్యల విషయంలో.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా సాధన విషయంలో పవన్ తమతో కలిసి రావాలని రామకృష్ణ ఆహ్వానించారు. కేవలం ట్వీట్ల ద్వారా ప్రశ్నిస్తే ఎటువంటి ప్రయోజనం వుండదని.. పోరాటబాట పడితేనే పలితం వుంటుందని ఆయన హితబోధ చేశారు. ఎన్నికల ముందు మోడీకి మద్దతునిచ్చిన పవన్.. ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రి హోదాలో ఉన్న మోడీనే ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం మాటలతో తన జనసేన పార్టీని భజనసేనగా మార్చవద్దని ఆయన పవన్ కి సలహా ఇచ్చారు. అలాగే పవన్ ని ఒక పార్టీ అధ్యక్ష హోదాలోనే కమ్యూనిస్టు పార్టీలతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రరాష్ట్రంలో నెలకొన్న ప్రజాసమస్యలపై, ప్రత్యేకహోదాపై అందరం కలిసి ఏకతాపిపై పోరాడదామని రామకృష్ణ పేర్కొన్నారు. మరి.. ఈయన పిలుపుకు పవన్ సమ్మతిస్తారా? లేదా? వేచి చూడాల్సిందే!

ఇదిలావుండగా... అవినీతి మకిలి పెద్దగా లేని కమ్యూనిస్టులు పవన్ ను ఈ విధంగా పిలుపునివ్వడంలో ఏమాత్రం తప్పులేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా పోరాడటం కంటే.. నలుగురు కలిసి ఏకతాటిపై పోరాడితే సమస్యల్ని అధిగమించవచ్చునని రామకృష్ణ చెప్పడంలో ఏమాత్రం తప్పులేదని ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. మరి.. ఈ పిలుపుపట్ల పవన్ ఎలా స్పందిస్తాడు? అతని పిట్టే (ట్విటర్) సమాధానం చెప్పాలి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  cpi ramakrishna  ap special status  

Other Articles