JUpalli Krishna Rao | Irrigation Projects | Mahabungar | Chandrababu Naidu | TDP | bund, Palamur lift irrigation

Jupalli krishna rao challenge the tdp leaders and chandrababu naidu to discuss about the irrigationprojects in the mahabubnagar dist

JUpalli Krishna Rao, Irrigation Projects, Mahabungar, Chandrababu Naidu, TDP, bund, Palamur lift irrigation

Jupalli Krishna Rao challenge the TDP leaders and Chandrababu naidu to discuss about the irrigationprojects in the Mahabubnagar Dist,

సవాల్ కు సిద్దమా..? ముక్కు నేలకు రాస్తారా..? జూపల్లి

Posted: 07/11/2015 08:06 AM IST
Jupalli krishna rao challenge the tdp leaders and chandrababu naidu to discuss about the irrigationprojects in the mahabubnagar dist

పాలమూరు ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నాయుడు అడ్డుపుల్ల వేస్తున్నారని.. దాన్ని నిరసిస్తు నిన్న టిఆర్ఎస్ పార్టీ బంద్ కు పిలుపునిచ్చింది. అయితే బంద్ పిలుపుతో పాలమూరు ఎత్తిపోతల పథకం మీద టిఆర్ఎస్ నేతలు టిడిపి మీద, చంద్రబాబు నాయుడు మీద విమర్శలు గుప్పించారు. అయితే మహబూబ్ నగర్ ను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన చంద్రబాబు జిల్లాకు చేసిందేమీ లేదు పైగా సాగునీటిని అందించే ప్రాజెక్టులకు అడ్డువేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. అయితే చంద్రబాబు నాయుడు కూడా పాలమూరు జిల్లాలో పథకాలను ప్రారంభించింది తానేనని అన్నారు. అయితే పాలమూరు జిలాలలోని భీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు టీడీపీ హయాంలో రూ.10 కోట్లైనా కేటాయించి ఖర్చు చేశారా? అని టీటీడీపీ నేతలను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.

Also Read:  ప్రతిపక్షాలను తొక్కేస్తున్నారంటున్న రేవంత్ రెడ్డి

చంద్రబాబు నాయుడు హయాంలో నిధులు ఖర్చు చేసినట్లు నిరూపిస్తే గతంలో చెప్పినట్లు ముక్కు నేలకు రాస్తానని అన్నారు. తన వద్ద ఉన్న వివరాలతో శనివారం ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వస్తానని, టీటీడీపీ నేతలు సహా చంద్రబాబు, చిన్నబాబు.. పెద్దబాబు ఎవరైనా వారివద్ద ఉన్న వివరాలతో వస్తే జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించేందుకు సిద్ధమని సవాల్ చేశారు. టీటీడీపీ నేతలకు దోచుకోవడం మీదే ధ్యాస అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఊడిగం చేస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని జూపల్లి మండిపడ్డారు.

Also Read:  పాలమూరులో చంద్రోదయం.. టిటిడిపికి కొత్త ఉదయం వస్తుందా..?

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినా ఒక్క రూపాయైనా కేటాయించారా? అని నిలదీశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఐదారు నెలల్లోనే ఏకంగా రూ.35,200 కోట్లతో ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చిందన్నారు. వలసల జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌ను అభినందించడానికి బదులు ఇంగితజ్ఙానం, సిగ్గు లేకుండా విమర్శిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి మారుపేరైన టీడీపీ నేతలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. వారిది నోరా? మున్సిపాలిటీ డ్రైనేజీనా అని మండిపడ్డారు. 2013లో నాటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం సర్వేకు జీవో జారీచేసినప్పుడు చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించలేదని జూపల్లి ప్రశ్నించారు.

Also Read:  రేపు పాలమూరుకు చంద్రబాబు.. టిఆర్ఎస్ నుండి షాక్

తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతల పథకం అక్రమమని కేంద్రానికి, సీడబ్ల్యూసీకి లేఖలు రాస్తున్న చంద్రబాబును టీటీడీపీ నేతలెందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఈ పథకం కావాలా? వద్దా? మీరు అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలన్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల టీడీపీ నేతలు తమ వైఖరి వెల్లడించాలని జూపల్లి డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న మిమ్మల్ని జిల్లా ప్రజలు, రైతులు ఊళ్లకు రానీయకుండా రాళ్లతో తరిమికొడతారని హెచ్చరించారు.

చివరకు ఇండ్లల్లో అన్నం కూడా పెట్టరని అన్నారు. టీటీడీపీ నేతలకు సిగ్గు శరం, దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబును నిలదీసి పాలమూరు ఎత్తిపోతల పథకానఇకి అనుకూలంగా కేంద్రానికి లేఖ రాయించాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ బీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవాన్ని తెస్తున్నందున మంత్రి హరీశ్‌రావును అభినందించడానికి బదులు టీటీడీపీ నేతలు విమర్శించడం సిగ్గుచేటన్నారు.

By Abhinavachary

Also Read:  తమ్ముళ్లూ... మీరు నా బలం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles