Revanth Reddy Controversial Comments On Talasani Srinivas Yadav Before Life | Telugu States Politics

Revanth reddy controversial comments talasani srinivas yadav bouncer life

Revanth Reddy news, Revanth Reddy controversy, Revanth Reddy comments, Revanth Reddy assets, talasani srinivas yadav news, talasani srinivas controversy, trs party leaders, tdp party leaders

Revanth Reddy Controversial Comments Talasani Srinivas Yadav Bouncer Life : Ttdp Leader Revanth Reddy Makes Controversial Comments On Trs Minister Talasani Srinivas Yadav.

బౌన్సర్ గా పనిచేసినోడు విమర్శలు చేస్తున్నాడు..

Posted: 05/09/2015 12:32 PM IST
Revanth reddy controversial comments talasani srinivas yadav bouncer life

తెలుగురాష్ట్రాల పొలిటికల్ రంగంలో వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టించే టీ.టీడీపీ నేత రేవంత్ రెడ్డి.. తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ పార్టీలోనే రాజకీయ పాఠాలు నేర్చుకున్న తలసాని.. టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి నుంచి తన తల్లిపార్టీ మీద తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే! టీడీపీ మంత్రులకు సవాల్ విసరడం, రకరకాల ఆరోపణలు చేయడం లాంటివి చేస్తున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రేవంత్.. ఇప్పుడు ఆయన మీద తన మాటలమంత్రాన్ని ప్రదర్శించారు.

సికింద్రాబాదులో జరిగిన టీడీపీ మినీ మహానాడులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తలసాని స్థాయికి మించిన విమర్శలు చేసి పార్టీలో పలుకుబడి పెంచుకుందామని ప్రయత్నిస్తున్నాడని అన్నారు. టీడీపీలోకి రాకముందు తలసాని సినీ నటుడు మోహన్ బాబు షూటింగుల దగ్గర బౌన్సర్ గా పనిచేసేవాడని తెలిపారు. అలాంటి తలసాని ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తనతో పోటీ చేయాలని సవాళ్లు విసురుతున్నాడని ఎద్దేవా చేశారు. చేతనైతే గెలిపించిన పార్టీకి రాజీనామా చేసి.. ఆ తర్వాత తాను ఎంత గొప్ప నేతో నిరూపించుకోవాలని రేవంత్ సవాలు విసిరారు.

ప్రస్తుతం తలసాని అనుభవిస్తున్న హోదా వెనుక టీడీపీ పెట్టుబడి, రక్తం, శ్రమ వుందని.. అతనికి సిగ్గూశరం వుంటే తక్షణం టీడీపీకి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ ఈ విధంగా చేసిన సంచలన కామెంట్లపై తలసాని ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  talasani srinivas yadav  trs party  tdp party  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more