Congress | Pranabh Mukharjee | KCR | Narasimhan | Speaker TDP | Talasani Srinivas Yadav

Telangana congress party leaders complints to president pranabh mukharjee on telangana cm kcr speaker and governor narasimhan

Congress, Pranabh Mukharjee, KCR, Narasimhan, Speaker, TDP, Talasani Srinivas Yadav

Telangana Congress party leaders complints to president Pranabh Mukharjee on telangana cm kcr speaker and governor narasimhan

ఆ ముగ్గురి మీద కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

Posted: 07/07/2015 08:59 AM IST
Telangana congress party leaders complints to president pranabh mukharjee on telangana cm kcr speaker and governor narasimhan

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై ఇప్పటికే ఫిర్యాదు చేసిన టిటిడిపి నాయకుల దారిలోనే కాంగ్రెస్ నాయకులు కూడా రాష్ట్రపతిని కలిశారు. అయితే గవర్నర్ నరసింహన్ తో పాటు, తెలంగాణ ముఖ్యమంత్రి, స్పీకర్ మీద కూడా  కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. గవర్నర్ నరసింహన్ న్యాయంగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ైదు పేజీల లేఖను కూడా రాశారు. అవసరమైతే న్యాయపోరాటానికి కూడా వెనుకడ అని కూడా హెచ్చరించారు. అయితే తాజాగా దాదాపు యాభై మంది కాంగ్రెస్ నాయకుల బృందం రాష్ట్రపతిని కలిశారు. ఫిరాయింపులు, రైతు ఆత్మహత్యలు, సమస్యలను వివరించింది. వేర్వేరుగా వినతి పత్రాలను ఈ బృందం సమర్పించింది.

Also Read:  టీ.టీడీపీ నేతలకు రాష్ట్రపతి షాక్.. మీరూ అదే బాటాలో..

రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి తెలంగాణ కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించేలా గవర్నర్‌, స్పీకర్‌ను ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి, నియంతృత్వ పాలనను కొనసాగించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్యాంగంలోని ప్రతి అంశాన్నీ అగౌరవపరుస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. బెదిరింపులు, లంచాలను ఎరగా చూపి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను లాగేసుకుంటున్నారని అన్నారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండాల్సిన ముఖ్యమంత్రే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని,  కుట్రపూరితంగా చట్టవిరుద్ధ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఇందుకు టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్‌ను టీఆర్‌ఎస్‌ మంత్రివర్గంలో చేర్చుకోవడమే నిదర్శనమని కాంగ్రెస్ నాయకుల మండిపడుతున్నారు. , రాజ్యాంగ పరిరక్షణ విధులను నిర్వర్తించడంలో వారిద్దరూ ఘోరంగా విఫలమయ్యారని ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఉల్లంఘించేలా టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.

Also Read:  నరసింహన్ చూస్తావా లేదంటే కోర్టుకు వెళతా

రాజ్యాంగం, సుప్రీం తీర్పుల ప్రకారం తలసాని మంత్రి పదవికి అనర్హుడని స్పష్టం చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందే తన ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా చేశారని, వెంటనే ఆయనతో గవర్నర్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారని, దానికి ముందు, ఆయన రాజీనామా ఆమోదం పొందిందో లేదో తెలుసుకునే ప్రయత్నాన్నిగవర్నర్‌ మాట మాత్రంగా కూడా చేయలేదని ఫిర్యాదు చేశారు. తాను ఆరు నెలల కిందటే రాజీనామా చేశానని తలసాని చెబుతున్నారు. కానీ, దానిని ఆమోదించారా, తిరస్కరించారా అన్న విషయంపై స్పీకర్‌ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వడం లేదని టిపిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. ప్రతిపక్షాలు పదే పదే ఫిర్యాదు చేస్తున్నా న్యాయం చేయడం లేదని,  ప్రతిపక్షాలను తుడిచి పెట్టాలన్న ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉందని అన్నారు. అయినా రాజ్యాంగ పరిరక్షకులైన గవర్నర్‌, స్పీకర్‌ మాత్రం తమ రాజ్యాంగ విధులను నిర్వర్తించడం లేదని. రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతున్నా చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారని మండిపడ్డారు.

Also Read:  గురువాజ్ఞ మేరకే మర్రి.. టార్గెట్ గవర్నర్..?


By Abhianavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  Pranabh Mukharjee  KCR  Narasimhan  Speaker  TDP  Talasani Srinivas Yadav  

Other Articles