Chandrababu | Delhi | Rajnath singh | AP | Telangana, Palamoor, Governor

Chandrababu naidu dont said that he dont want to change the governor and also no need to wanish kcr govt

Chandrababu, Delhi, Rajnath singh, AP, Telangana, Palamoor, Governor

Chandrababu naidu dont said that he dont want to change the governor and also no need to wanish kcr govt. After return form Japan chandrababu Naidu met central ministers in Delhi.

గవర్నర్ మార్పు, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు

Posted: 07/11/2015 08:02 AM IST
Chandrababu naidu dont said that he dont want to change the governor and also no need to wanish kcr govt

ఏపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య సాగుతున్న వివాదాల నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ ను మార్చాలని కేంద్రం మీద వత్తిడి తీసుకువస్తున్నట్లు వచ్చిన పుకార్లను కొట్టివేస్తు తాజా చంద్రబాబు ప్రకటన చేశారు. గవర్నర్ మార్పు వల్ల సమస్యకు పరిష్కారం లబించదని వెల్లడించారు. అయితే గతంలో చంద్రబాబు నరసింహన్ మీద ఫిర్యాదు చేసిన మాటల మాత్రం వాస్తవమే. గవర్నర్ మార్పు లేదు అని చెప్పడంతో పాటుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారుజ జపాన్ పర్యటన ముగించుకు వచ్చిన తర్వాత బాబు ఢిల్లీలో బిజిబిజిగా గడిపారు. కాగా రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలతో పాటు పలు కీలక అంశాల మీద బాబు చర్చించినట్లు సమాచారం.

Also Read:  బాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విభజనకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. సెక్షన్‌ 8పైనా ఆయనతో మాట్లాడానని, విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని చెప్పారు. ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని కేంద్ర హోంశాఖ రూపొందించిందని నోడల్‌ మంత్రిత్వ శాఖ అదే అని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలున్నాయని,  కేంద్రానికి సంబంధించిన మరికొన్ని సమస్యలు ఉన్నాయని, కేంద్రం అమలు చేయాల్సిన మరికొన్ని చట్టాలు ఉన్నాయని అన్నారు.  ఈ అన్ని అంశాలపైనా రాజ్‌నాథ్‌ సాధ్యమైనంత తొందరలో నిర్ణయం తీసుకోవాలని,  ఇందుకు ఆయన ఒక సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. దాని ద్వారా సానుకూల పరిష్కారాన్ని సాధించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

Also Read:  వివి వినాయక్ డైరెక్షన్ లో చంద్రబాబు

హైదరాబాద్ లో నీకేంపని అని కేసీఆర్ వ్యాఖ్యానించారని.. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అని చంద్రబాబు గుర్తు చేశారు. అయినా తాను హైదరాబాద్‌లో ఉండడం లేదని, నాలుగు రోజులు ఏపీలో తిరుగుతున్నానని, ప్రపంచంలో అన్ని దేశాలకూ వెళుతున్నానని చెప్పారు. ఇరు రాష్ట్రాల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూర్చుని మాట్లాడడానికి తానెప్పుడూ సిద్ధమేనని పునరుద్ఘాటించారు. గోదావరి పుష్కరాలకు కేసీఆర్‌ సహా అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులనూ ఆహ్వానిస్తామని చెప్పారు. తమ పార్టీ నేతలే గవర్నర్‌ను విమర్శించడంపై మాట్లాడుతూ ఎవరి వాదన వారికుంటుందని, అయితే ఈ విషయంలో సంయమనం పాటించడం అవసరమని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతలపై కూడా కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని, చట్టంలో ఉన్నట్లు అమలు చేయాలని, దీనిపై కేంద్ర మంత్రి సమక్షంలో మాట్లాడుకునే అవకాశం ఉందని చెప్పారు. నిజానికి ఆధునీకరణ ద్వారా కృష్ణా జలాలను ఆదా చేసి బీమా ప్రాజెక్టును నిర్మించింది తానేనని, కల్వకుర్తి, కోయిల్‌ సాగర్‌ తదితర ప్రాజెక్టులను తానే ప్రారంభించానని గుర్తు చేశారు. ఏదో విధంగా నిందించాలని చూడకుండా కలిసికట్టుగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

By Abhinavachary

Also Read:  ఇక ఆపరేషన్ కేసీఆర్.. బాబు మంత్రాంగం
Also Read:  బాబు ప్రధాని మోదీతో భేటీ అయింది అందుకేనా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Delhi  Rajnath singh  AP  Telangana  Palamoor  Governor  

Other Articles