Revanth Reddy | Mahabubnagar | Palamoor | KCR | bund | TDP | Chandrababu Naidu

Telangana telugudesam party mla revanth reddy one more time fire on kcr and his govt for mahabubnagar bund call

Revanth Reddy, Mahabubnagar, Palamoor, KCR, bund, TDP, Chandrababu Naidu

Telangana Telugudesam party MLA Revanth Reddy one more time fire on KCR and his govt for mahabubnagar bund call.

ప్రతిపక్షాలను తొక్కేస్తున్నారంటున్న రేవంత్ రెడ్డి

Posted: 07/10/2015 04:10 PM IST
Telangana telugudesam party mla revanth reddy one more time fire on kcr and his govt for mahabubnagar bund call

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, ఓటుకు నోటు కేసులో ఏ1 నిందుతుడు రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ ప్రభుత్వం మీద ఫైరయ్యారు. బెయిల్ మీద బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి విడుదలైన తర్వాత నుండి మీడియా ముందుకు రాలేదు. అయితే తాజాగా మహబూబ్ నగర్ జిల్లా బంద్ కు టిఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. పాలమూరు ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నాయుడు అడ్డుపుల్ల వేస్తున్నారని, ఆయన వైఖరికి నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా బంద్ పిలుపునిచ్చారు. అయితే బంద్ మీద రేంవత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వం మీద మండిపడ్డారు. ఎక్కడైనా ప్రతిపక్షాలు బంద్ కు పిలుపునిస్తాయి కానీ ఇలా ప్రభుత్వమే బంద్ కు పిలుపునివ్వడం ఏంటని ప్రశ్నించారు.

Also Read: తెలంగాణ పులి బిడ్డ రేవంత్ రెడ్డి అంటూ వీడియో

పాలమూరు ఎత్తిపోతల పథకానికి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమని, చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును ఎలా అయినా అడ్డుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని టిఆర్ఎస్ మండిపడుతోంది. అయితే మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ది పథాన నడిపించింది చంద్రబాబు నాయుడే అని రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లాలో కీలక ప్రాజెక్టులకు శంకు స్థాపన చేసి.. జిల్లాలో 80 వేల ఎకరాలకు పాగునీటిని అందించింది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. అసలు ఏ ఉద్దేశంతో బంద్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, టిఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. ఎందుకు బంద్ పాటిస్తున్నారు అని తెలపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని రేవంత్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బంద్ కు పిలుపునివ్వడం అనాగరికం అని రేవంత్ అన్నారు. రాష్ట్రం ఏర్పడి ఏడాది దాటిన తర్వాత కూడా సెంటిమెంట్ ను అడ్డంపెట్టుకొని పబ్బం గడుపుకోవడానికి మామ కేసీఆర్, అల్లుడు హరీష్ రావ్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Also Read:  రేవంత్ రెడ్డే తెలంగాణ టిడిపిలో రింగ్ మాస్టర్..!

ప్రభుత్వమే బంద్ కు పిలుపునివ్వడం మీద కొంత మంది రేవంత్ రెడ్డిని తిరిగి ప్రశ్నిస్తున్నారు.
* మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీటిని అందించే పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు లేఖరాసింది నిజమా. కాదా..?
* మహబూబ్ నగర్ జిల్లా పథకాల మీద, ఖర్చు చేసిన సొమ్ము మీద చర్చించడానికి సిద్దంగా ఉన్నామన్న తెలంగాణ మంత్రి జూపల్లి సవాల్ ను రేవంత్ రెడ్డి స్వాగతిస్తారా..? స్వీకరిస్తారా..?
* గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు... తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా బంద్ కు పిలుపునిచ్చారు అన్న విషయం కూడా తెలియదా..?
* పాలమూరు ఎత్తిపోతల పథకానికి తెలుగుదేశం పార్టీ మద్దతుగా నిలిచినప్పుడు... అన్ని పక్షాలను కలుపుకొని ప్రాజెక్టు పనుల కోసం ప్రభుత్వం మీద వత్తిడి చెయ్యవచ్చు కదా..?

మరి చంద్రబాబు నాయుడుకానీ రేవంత్ రెడ్డి కానీ వీటికి సమాధానాలు ఇవ్వాలి

By Abhinavachary

Also Read:  నాకు బెయిల్ రావడమే ఆయనకు జ్వరాన్ని తెప్పించింది.
Also Read:  ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుకు ఎదురుదెబ్బ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  Mahabubnagar  Palamoor  KCR  bund  TDP  Chandrababu Naidu  

Other Articles