Telangana | KCR | Districts | Suryapet | Siddipet | Mahabubnagar, Adilabad, Vikarabad, Kamareddy, Nagarkurnool

Telangana cm kcr likely to propose new districts in the telangana state

Telangana, KCR, Districts, Suryapet, Siddipet, Mahabubnagar, Adilabad, Vikarabad, Kamareddy, Nagarkurnool

Telangana CM KCR likely to propose new districts in the telangana state. KCR may propose new 11 dists in the state.

తెలంగాణలో కొత్త జిల్లాలు ఇవేనా..?

Posted: 07/08/2015 08:14 AM IST
Telangana cm kcr likely to propose new districts in the telangana state

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం మరిన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తానని ప్రస్తుత తెలంగాణ సిఎం అప్పట్లో హామీలిచ్చారు. అయితే తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టిసారించారు.ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను పునర్వ్యవస్థీకరించి కొత్తగా మరో 11 జిల్లాలను ఏర్పాటుచేయటంపై కసరత్తు తీవ్రం చేశారు. జిల్లా పరిధిలోని అన్ని ప్రాంతాలు జిల్లా కేంద్రానికి దాదాపు సమాన దూరంలో ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం సిద్దిపేట, సంగారెడ్డి, జగిత్యాల, సూర్యాపేట, కొత్తగూడెం, నాగర్ కర్నూలు, మంచిర్యాల (కొమురంభీమ్), వికారాబాద్, కామారెడ్డి, హైదరాబాద్‌లో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తారు. ఇంకా పరిపాలనా సౌలభ్యం కోసం అదనంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని భావిస్తే రెండో విడతలో మరి కొన్ని జిల్లాలను ఏర్పాటు చెయ్యవచ్చు.

Also Read:  కేసీఆర్ టార్గెట్ వాళ్ల కొడుకులే

రెండో విడత జిల్లాల ఏర్పాటుకు పూనుకుంటే మరో నాలుగు జిల్లాలు ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ఇందులో భూపాలపల్లి, ములుగు, వనపర్తితోపాటు హైదరాబాద్‌లో మరో జిల్లా అదనంగా చేసే అవకాశం ఉందని తెలిసింది. మొదటి విడతలో మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా విభజిస్తారు. మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తారు. ప్రస్తుత జిల్లా కేంద్రం సంగారెడ్డితోపాటు సిద్దిపేటలను కొత్త జిల్లాలుగా ఏర్పాటుచేస్తారు. హైదరాబాద్ జిల్లాను విభజించి మొత్తం మూడు జిల్లాలుగా మారుస్తారు. ఈ ఏడాది చివరినాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.హరితహారం పర్యటనల్లో భాగంగా ఆయన జిల్లాల ఏర్పాటుపై ప్రకటనలు చేశారు. సిద్దిపేటలో జరిగిన హరితహారం సభలో సిద్దిపేటను జిల్లాగా మారుస్తామని, మెదక్ పట్టణాన్ని కూడా జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే అదిలాబాద్ జిల్లాలో కొమురంభీమ్ జిల్లాను ఏర్పాటు చేస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిని, నల్లగొండ జిల్లాలోని సూర్యాపేటను, కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల పట్టణాలను కూడా జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

Also Read:  మంత్రి పదవులు ఉండేనా..? ఊడేనా..?

పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీనియర్ ఐఏఎస్ అధికారులు అంటున్నారు. అదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలు సిక్కిం, త్రిపుర రాష్ర్టాల కంటే విస్తీర్ణంలో పెద్దగా ఉన్నాయని, ఇలాంటి జిల్లాలను వికేంద్రీకరించాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపితే సరిపోతుందని ఒక అధికారి తెలిపారు. కొత్త జిల్లాలతోపాటు, రెవెన్యూ డివిజన్లు, సబ్ డివిజన్లు, కొత్త మండలాలు కూడా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకోవచ్చని, వీటికి శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయని సీనియర్ రెవెన్యూ అధికారులు చెప్తున్నారు.

Also Read:  సెక్షన్-8కు వ్యతిరేకంగా కేసీఆర్ సమర‘దీక్ష’..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  KCR  Districts  Suryapet  Siddipet  Mahabubnagar  Adilabad  Vikarabad  Kamareddy  Nagarkurnool  

Other Articles