TDP MLA Sandra Venkat Veeraiah | bail enquiry | Court

Sandra venkateveeriah bail petetion willbe prosecute today

TDP MLA Sandra Venkat Veeraiah, bail enquiry

Sandra Venkateveeriah bail petetion willbe prosecute today. In the Cash for vote case ACB arrest tdp mla sandra and the court order to remand sandra for 14 days.

సండ్రకు బెయిల్ వచ్చేనో ..? లేదో..?

Posted: 07/08/2015 08:37 AM IST
Sandra venkateveeriah bail petetion willbe prosecute today

ఓటుకు నోటు కేసులో నిందితుడు సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సండ్రను కస్టడీకివ్వాలని ఏసీబీ అధికారులు కోర్టుని కోరారు.మరోవైపు సండ్ర కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. సండ్రను ప్రశ్నించిన తర్వాత ఓటుకు నోటు కేసులో ఏసీబీకి కొత్త సమాచారం తెలిసిందని..అధికారులు దీనిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సండ్రను అరెస్ట్ చేసిన అధికారులు..కోర్టులో ప్రవేశ పెట్టారు. అంతకు ముందు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని కుట్రదారుల సంగతి  న్యాయపోరాటం చేసే తేల్చుకుంటామని సండ్ర తెలిపారు.

Also Read :  ఓటుకు నోటు కేసులో మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర అరెస్టు

అనంతరం సండ్రను కోర్టులో ప్రవేశ పెట్టారు ఏసీబీ అధికారులు. న్యాయమూర్తి ఆయనకు ఈ నెల 21 వరకూ రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. సండ్ర ఎమ్మెల్యే కావడంతో ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో మరింత సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా సండ్రను ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్ వేసింది. సండ్ర అరెస్ట్ అక్రమమని.. ఆయనకు బెయిల్ ఇప్పించాలని కోరుతూ సండ్ర ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. సండ్ర వీరయ్య ఇదే కేసులో మరో నిందితుడు  సెబాస్టియన్‌తో మాట్లాడిన ఆడియో నివేదికను ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో మరోసారి వేం నరేందర్‌ రెడ్డిని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. సండ్రను కోర్టు ఏసీబీ కస్టడీకి ఇస్తుందా లేదా అనేది నేడు తేలనుంది.

Also Read:  సండ్రకు 14 రోజుల రిమాండ్.. రేపు బెయిల్ పిటిషన్ పై విచారణ

Also Read: చేసింది మొత్తం సండ్రనే.. ఇవిగో ఫోన్ సంభాషణలు

చేసింది మొత్తం సండ్రనే.. ఇవిగో ఫోన్ సంభాషణలు

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP MLA Sandra Venkat Veeraiah  bail enquiry  

Other Articles