KCR | Ministers | Telangana | Cabinet | Koppula | Rasamaye Balakrishna

Telangana ministers have the fear about the minister posts

KCR, Ministers, Telangana, Cabinet, Koppula, Rasamaye Balakrishna

Telangana Ministers have the fear about the minister posts. KCR hint that get ready to sacrifise about the ministries. Some ministers labbing to KCR.

మంత్రి పదవులు ఉండేనా..? ఊడేనా..?

Posted: 07/07/2015 07:58 AM IST
Telangana ministers have the fear about the minister posts

తెలంగాణ మంత్రుల్లో కొత్త భయం పట్టుకుంది.త్యాగాలకు సిద్ధంకావాలని సీఎం సంకేతాలివ్వటంతో కేబినెట్‌ సర్దుబాట్లలో ఎవరి పోస్టు ఊడుతుందోనన్న చర్చ మొదలైంది.ఎవరికి చెక్‌ పడుతుందన్న చర్చ జోరుగా జరుగుతోంది.ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు మంత్రి పదవి ఇస్తానని కొన్నాళ్ల క్రితం హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్‌.ప్రస్తుతం  రసమయి సాంస్కృతిక విభాగ సారథిగా ఉన్నారు. తాజాగా కొప్పుల ఈశ్వర్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటానని జిల్లా పర్యటనలో  వరమిచ్చారు అధినేత. కొప్పుల ఈశ్వర్‌ ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ఉన్నారు. కేసీఆర్‌ పబ్లిక్‌గా హామీ ఇచ్చారు కాబట్టి వీరిద్దరికీ కేబినెట్‌లో చోటు గ్యారెంటీ అనుకుంటున్నారు.

Also Read:  తెలంగాణ మంత్రివర్గంలోకి కొత్త మొహాలు.. మరి పాత వారి సంగతి.?

కొప్పుల ఈశ్వర్‌కు మొదట్లోనే  కేబినెట్‌లో అవకాశం వస్తుందనుకున్నారు.వాస్తవానికి కొప్పుల ఈశ్వర్‌నే ఉపముఖ్యమంత్రిని  చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ అవకాశం వరంగల్‌ జిల్లాకు చెందిన రాజయ్యకు దక్కింది. కొప్పులకు మంత్రి పదవి  ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు అప్పట్లో ఆందోళనకు కూడా దిగారు. చీఫ్‌ విప్‌ పదవి ఇచ్చినా వద్దని కొప్పుల అలకబూనారు.  కేసియార్‌ను కలిశాక  అయిష్టంగానే చీఫ్‌ విప్‌ కుర్చీలో కూర్చున్నారు. ఇప్పుడు స్వయాన కేసీఆరే  కేబినెట్‌లో చోటు కల్పిస్తానని ప్రకటించడంతో కొప్పులకు మంత్రి పదవి ఖాయమైపోయిందన్న చర్చ జరుగుతోంది పార్టీలో.

Also Read: మంత్రుల మీద మండిపడ్డ రేవంత్ రెడ్డి

అటు కొప్పుల, ఇటు రసమయి ఇద్దరూ ఎస్సీ సామాజికవర్గం నేతలే కావడంతో వారికి  బెర్త్‌ కన్‌ఫామ్‌ అయినట్లేనంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌ నిండుగా ఉంది. ఒకర్ని చేర్చుకోవాలన్నా ఎవరో ఒకర్ని  తప్పించాలి.కాబట్టి కేబినెట్‌లో బెర్త్‌ కోసం ఈ కాంపిటీషన్‌ చూస్తున్న మంత్రులకు టెన్షన్‌ మొదలైందట.ఏడాది పాలన పూర్తైంది కాబట్టి... మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ అంచనాకు వచ్చారని తెలుస్తోంది.  ఇప్పుడున్న మంత్రుల్లో కొందరికి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జరుగుతోంది.

Also Read:  ట్యాపింగ్ పై నిజం ఒప్పుకున్న తెలంగాణ మంత్రి

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Ministers  Telangana  Cabinet  Koppula  Rasamaye Balakrishna  

Other Articles