Cm kcr to make deeksha against section 8 | hyderabad city | tdp party | Governor Rule

Cm kcr deeksha against section 8 hyderabad city tdp party

cm kcr, kcr diksha, kcr deeksha, kcr latest news, cm kcr photos, cm kcr updates, cm kcr news, cm kcr gossips, kcr photos, kcr news, section 8 controversy, tdp party, chandrababu naidu, central government

Cm kcr deeksha against section 8 hyderabad city tdp party : Cm kcr to make deeksha against section 8. But official statement has to be revealed.

సెక్షన్-8కు వ్యతిరేకంగా కేసీఆర్ సమర‘దీక్ష’..?

Posted: 06/23/2015 01:01 PM IST
Cm kcr deeksha against section 8 hyderabad city tdp party

టీడీపీ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు తెరాస చేసిన ప్రయత్నాలు వారినే ఇబ్బందుల్లో పడేసినట్లు కనిపిస్తోంది. ‘ఓటుకు నోటు’, ‘ఫోన్ ట్యాపింగ్’ వంటి వ్యవహారాలతో టీడీపీని ముచ్చెమటలు పట్టిద్దామని భావించిన తెలంగాణ ప్రభుత్వం స్వయం చెమటల సరస్సులో మునిగిపోయినట్లు చెప్పుకుంటున్నారు. ఆ రెండు వివాదాలు తెరమీదకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ను ముప్పుతిప్పలు పెట్టేందుకు ఏపీ సర్కార్ తనదైన రీతిలో పావులు కదుపుతోంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంపై గవర్నర్ కి అధికారం అప్పగించాలని ఉద్దేశంతో కేంద్రప్రభుత్వంతో ‘సెక్షన్-8’ అమలుపై మంతనాలు జరిపింది. ఇప్పుడు ఈ విషయమై విస్రృత చర్చ జరుగుతోంది.

ఓవైపు సెక్షన్-8 అమలు కోసం ఏపీ సర్కార్ పట్టుబడుతుండగా.. దానిని అమలు చేస్తే సహించేది లేదని తెలంగాణ సర్కార్ చెబుతోంది. ఇప్పటికే ఈ సెక్షన్-8 అమలుపై కేంద్రం సానుకూలంగా వుండటంతో కేసీఆర్ సర్కార్ అప్రమత్తమైంది. ఈ సెక్షన్-8ని అమలు చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనైనా ప్రతిఘటించి తీరుతామని టీఆర్ఎస్ ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు కేసీఆర్ దీనిని వ్యతిరేకంగా తనదైన శైలిలో ముందుకు నడుస్తున్నట్లు సమాచారం! ఈ సెక్షన్-8కు వ్యతిరేకంగా ఆయన జాతీయ స్థాయిలో మద్దతు కూడగడుతున్నారని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆయన జాతీయ పార్టీలకు చెందిన కొందరి నేతలతో మంతనాలు కూడా జరిపారట.. ఈ సెక్షన్-8 వ్యతిరేకంగా తమతోపాటు మద్దతు తెలిపాల్సిందిగా ఆయన కోరారని సమాచారం!

అవసరమైతే సెక్షన్-8కు వ్యతిరేకంగా దీక్షకు దిగేందుకు కూడా తాను సిద్ధంగానే వున్నానని తన సన్నిహితులతో కేసీఆర్ పేర్కొన్నట్లు ఒకటే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సమర‘దీక్ష’ను హైదరాబాదులో చేపట్టాలా లేకా ఢిల్లీలోనా? అనే విషయంపై తన పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు కొనసాగిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే.. సెక్షన్-8కు వ్యతిరేకంగా కేసీఆర్ దీక్షకు దిగుతారా? లేదా? అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే! ఏదేమైనా.. సెక్షన్-8 తెలంగాణ సర్కార్ ను బాగానే ముప్పుతిప్పలు పెట్టిస్తోందని చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cm kcr diksha  section 8  hyderabad city  tdp party  

Other Articles