revanth reddy lashes out on kcr after releasing from jail

Revanth reddy takes on telangana cm kcr

cash on vote, phone tapping, media, revanth reddy, cash for vote, cherlapally central jail, bail, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh CID, cash for vote, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

After releasing from one month jail in cash for vote row, Telangana TDP leader revanth reddy takes on chief minister kcr

నాకు బెయిల్ రావడమే ఆయనకు జ్వరాన్ని తెప్పించింది.

Posted: 07/01/2015 11:26 PM IST
Revanth reddy takes on telangana cm kcr

తెలంగాణ ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా కేసు పెట్టిందని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో బెయిల్ పొంది చర్లపల్లి జైలు నుంచి విడుదలైన తర్వాత టీడీపీ శ్రేణులు, తన అభిమానులను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన నాయకత్వంలోని టీఆరెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్నీ తనపైనే ప్రయోగించి ఈ కేసులో ఇరికించారని రేవంత్‌ ఆరోపించారు. కేసీఆర్‌ నిజంగా తెలంగాణ బిడ్డే అయితే టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
 
కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు రాజకీయ సమాధి చేస్తారని రేవంత్ హెచ్చరించారు. కేసీఆర్‌ను గద్దె దింపడమే తన ఏకైక లక్ష్యమన్న రేవంత్‌, కేసీఆర్‌ కుటుంబాన్ని రాజకీయాల నుంచి తరిమికొట్టేలా ప్రజలను చైతన్యపరుస్తానని, ప్రతి యువకుడిని భుజం తట్టి లేపుతానని అన్నారు. తెలంగాణ మంత్రులను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతూ వారందరూ లెసలెస మాట్లాడుతున్నారని, సోడాలు కలిపేవాళ్లు, మోండా మార్కెట్‌లో ఆలుగడ్డలు అమ్మే వ్యక్తి మంత్రులయ్యారని.. సన్నాసులంతా తాగుబోతోడి పక్షం చేరారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  cash on vote  phone tapping  media  KCR  

Other Articles