Telangana, Ministers, KCR, Cabinet, Sinivas Gour, DS, Swamy Goud

Telangana cm kcr likely to expend the telangana cabinet but he prefer new faces in the cabinet

Telangana, Ministers, KCR, Cabinet, Sinivas Gour, DS, Swamy Goud

Telangana cm KCR Likely to expend the telangana cabinet but he prefer new faces in the cabinet. There is no vacancies in the cabinet so kcr want to remove some ministers ministries and to give chance to new faces.

తెలంగాణ మంత్రివర్గంలోకి కొత్త మొహాలు.. మరి పాత వారి సంగతి.?

Posted: 07/03/2015 08:12 AM IST
Telangana cm kcr likely to expend the telangana cabinet but he prefer new faces in the cabinet

మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనవుతుందని అన్న సామెత అందరికి తెలిసే ఉంటుంది. అయితే తెలంగాణలో అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీకి ఈ సూత్రం వర్తిస్తుంది. ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి వలసలను ముందుండి ప్రోత్సహిస్తున్నారు కేసీఆర్. ఏ పార్టీ నుండి వచ్చినా కానీ తమ పార్టీలొకి గులబి కండువా కప్పి స్వాగతం పలుకుతున్నారు. అయితే పార్టీలొకి వలసలు ఎక్కెువ కావడవంతో ఎవరికి ప్రధాన్యత ఇవ్వాలొ కూడా క్లారిటీ లేకుండా పోయింది. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నుండి కొత్తగా నేతల చేరిక తర్వాత కేసీఆర్ మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయని వార్త వినిపిస్తూ వస్తోంది. అయితే ఆ వార్తలు నిజమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉన్న కొందరికి స్వస్తి పలికి కొత్త వారికి కేబినెట్ లో చోటు కల్పించేందుకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ మంత్రులు త్యాగాలకు సిద్దంగా ఉండాలని వ్యాఖ్యనించడం చర్చనీయాంశంగా మారింది.

అయితే ఇప్పటికిప్పుడు ఎవరికి మంత్రి పదవి ఊడుతుంది అన్న దానిపై క్లారిటీ లేకున్నా బహుళా నెలా రెండు నెలలోపు మాత్రం ఖచ్చితంగా పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే మంత్రులుగా సమర్తవంతగా పని చయ్యడం లేదని కొందరి మీద కేసీఆర్ గతంలొనే అసహనం వ్యక్తం చేశారు. అయితే తాజాగా వారినే టార్గెట్ గా చేసి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా..? లేదా వేరే వారిని తొలగించేందుకే ఇలా వ్యాఖ్యానించారా..? అన్నది తెలియదు. గత ఏడాది జూన్‌ 2న రాష్ట్ర విభజన జరిగి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన రోజే ముఖ్యమంత్రిగా కేసీఆర్‌, మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. తిరిగి అదే ఏడాది డిసెంబర్‌ 16న మరో ఆరుగురు మంత్రివర్గంలో చేరారు. రాష్ట్రంలోని శాసనసభ్యుల దామాషా ప్రకారం ముఖ్యమంత్రిసహా కేబినెట్‌ సభ్యుల సంఖ్య 18 కంటే మించకూడదు. ఈ కారణంగానే ఈ ఏడాది జనవరిలో అప్పటి డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించాలనుకున్న సీఎం కేసీఆర్‌ ఆయనను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేసిన తర్వాతనే ఆ స్థానంలో కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దాంతో మంత్రివర్గంలో సింగిల్‌ బెర్త్‌ కూడా ఖాళీగా లేదు. అయినప్పటికీ, సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఎంతో మందికి హామీలు ఇచ్చారు.. ఇస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలుగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన స్వామిగౌడ్‌, శ్రీనివాస్ గౌడ్‌ టీఆర్‌ఎస్ లో చేరిన తర్వాత వారికి మంత్రి పదవులు ఇస్తానని ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు.

పార్టీలో సీనియర్‌ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. అలాగే ఎమ్మెల్యే కొండా సురేఖ సహా పార్టీ ఎమ్మెల్యేలలో పలువురు కేసీఆర్‌ నుంచి మంత్రి పదవి హామీలు పొందారు. ఇందులో స్వామిగౌడ్‌కు శాసన మండలి చైర్మన్‌ పదవి దక్కగా, కొప్పుల ఈశ్వర్‌కు డిప్యూటీ సీఎం నుంచి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ వరకు అన్ని పదవులు ఊరించి చివరికి ప్రభుత్వ చీఫ్‌ పదవి వరించింది. మిగిలిన వారి పరిస్థితి ఇక అంతే సంగతులు. ఇటీవలి కాలంలో పార్టీ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్‌ను సాంస్కృతిక శాఖకు మంత్రిని చేస్తానని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీని వీడిన సీనియర్‌ నేత డి.శ్రీనివాస్‌ తన మెడలో గులాబీ కండువా కప్పుకోవటానికి సిద్ధమయ్యారు. టీఆర్‌ఎస్‌ తరఫున డీఎస్‌ రాజ్యసభ సీటును ఆశిస్తున్నారని, పార్టీ అధినాయకత్వం మాత్రం ఆయనకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి ఇవ్వటానికి సుముఖంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి పదవుల ఆశ చాలా మందికే ఉంది. అందుకు కారణం కూడా ముఖ్యమంత్రి కేసీఆరే. ఎందుకంటే పార్టీ ఎన్నికల సమయంలో, వలసల సమయంలో ఇచ్చిన హామీలే ఇప్సటి పరిస్థితికి కారణం. మరి ఎంత మందికి మంత్రి పదవులు ఊడతాయో.. ఎంత మందికి కొత్తగా మంత్రి పదవులు దక్కుతాయో తెలియాలి. కాగా మంత్రి పదవుల నుండి తప్పుకున్న లేదా తప్పించిన వారు ఊరికే ఉంటారా లేదా తిరుబాటు జెండా ఎగరవేస్తారా చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Ministers  KCR  Cabinet  Sinivas Gour  DS  Swamy Goud  

Other Articles