Vyapam scam: Congress demands sacking of Madhya Pradesh CM Shivraj Singh Chouhan, impartial probe

Chouhan cannot escape responsibility says congress

Chouhan cannot escape responsibility, says Congress, Vyapam scam, Vasundhara Raje Scindia, Vasundhara Raje, Sushma Swaraj, Supreme Court, spokesperson, Shivraj Singh Chouhan, Dr Arun Sharma,Vyapam scam,MPPEB scam,MPPEB,Dean Arun Sharma,Jabalpur medical college,NS medical college, Delhi journalist death, Aaj Tak journalist, Vyapam scam, Rahul Gandhi, Arvind Kejriwal, cremation, Kailash Vijayvargiya, Journalist, Akshay Singh, joke, media

Congress today stepped up its attack on Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan over Vyapam scam, saying he should be sacked to allow an impartial probe and that he cannot escape responsibility for the "45 deaths" connected to it.

సీఎం చౌహాన్ కూడా వ్యాపం కుంభకోణంలో దోషే

Posted: 07/06/2015 10:22 PM IST
Chouhan cannot escape responsibility says congress

వ్యాపమ్‌ స్కామ్‌లో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కూడా నిందితుడే అని కాంగ్రెస్‌పార్టీ ఆరోపించింది. తక్షణం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ కిల్లర్ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి వసుంధర రాజేలు అభియోగాలు ఎదుర్కోంటున్న లలిత్ గేట్ కుంభకోణంలో వహించినట్టు మౌనం వహించడం తగదని కాంగ్రెస్‌ అంటోంది.

బిజేపి కి చెందిన ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు స్కామ్‌లో పుట్టలుగా మారారని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ సందర్భంగా సోమవారం కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పిసీ చాకో మాట్లాడుతూ ఇది అవినీతి మరక పట్టిన ప్రభుత్వమని బీజేపీపై మండిపడ్డారు. ఏడాది క్రితం అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పుడు అదే పార్టీ స్కామ్‌లతో నిందిపోయిందని ఆయన అన్నారు. అవినీతికి మారు పేరుగా నిలుస్తోందని చాకో విమర్శించారు. ఇకనైనా ప్రధాని మోదీ నోరు విప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రధాని ఇండియాలో ఉండరని, భారత్‌లో గడిపేందుకు ఆయనకు సమయమే దొరకడ లేదని చాకో అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vypam scam  pc chacko  congress  shivraj singh chouhan  

Other Articles