UV radiation index ultra high in Telanagana, Andhra Pradesh

High ultraviolet radiation responsible for steep rise in heat deaths in telangana and andhra prades

UV radiation index ultra high in Telanagana and Andhra Pradesh, ultra-violet (UV) radiation index, World Meteorological Organisation (WMO), High ultraviolet radiation, heat deaths, Meteorological Organisation, Telangana, Andhra Pradesh

The steep rise in sunstroke deaths in Telangana and Andhra Pradesh is the result of the ultra-violet (UV) radiation index in the two states that stands at a critically high figure of 12

తస్మాత్ జాగ్రత్తా.! ఆ కిరణాల తీవ్రతే మరణాలకు కారణం..!

Posted: 05/27/2015 06:35 PM IST
High ultraviolet radiation responsible for steep rise in heat deaths in telangana and andhra prades

మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి గ్రీష్మతాపానికి ప్రజలు, పశుపక్షాదులు అనేకం అసువులు బాయడానికి కారణం అతినీలలోహిత కిరణాల (అల్ట్రా వైలట్ రేస్) వల్లేనని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) స్పష్టం చేసింది. వీటి వల్లే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వడదెబ్బతో మృతుల సంఖ్య పెరుగుతోందని ఆ సంస్థ పేర్కోంది. డబ్ల్యూఎంవో విడుదల చేసిన ఆల్ట్రా వైలెట్ (యూవీ) రేడియేషన్ ఇండెక్స్ లో.. భారత దేశంలోని ఈ రెండు రాష్ట్రాల్లో తీవ్రత 12 గా నమోదైంది. యూవీ ఇండెక్స్ 12 దాటడం మానవ శరీరానికి తీవ్ర హాని కలిగిస్తుందని, ఇంత తీవ్రతతో వచ్చే అతినీల లోహిత కిరణాల వల్ల వడదెబ్బ తగిలి మృతి చెందడమే కాకుండా చర్మ కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

ఈ రేడియేషన్ తీవ్రత మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎక్కువగానూ, ముఖ్యంగా ఒంటి గంట ప్రాంతంలో అత్యధికంగా నమోదవుతోందని పేర్కొంది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రమే రేడియేషన్ తీవ్రత తగ్గుముఖం పడుతున్నట్లు తెలిపింది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే చర్మరక్షణ కోసం సన్ స్క్రీన్స్ ఉపయోగించడం, కూలింగ్ గ్లాసెస్ ధరించడం, శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం భానుడి భగభగ మండిపోతున్నాడు. అల్ట్రా వైలెట్ రేస్ తీవ్రత కూడా అధిక స్థాయిలోనే వుంది. తప్పనిసరిగా భయలకు వెళ్లాల్సివచ్చే వారు ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తెలుగు రాష్ర్టాల్లో వడదెబ్బ మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రజలు ఇళ్లలోనుంచి భయటకు వచ్చేందుకే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు చెప్పిన కొన్ని చిట్కాలు..
 
* వేడిగా ఉన్న రోజుల్లో తప్పనిసరిగా గొడుగువాడాలి, నెత్తిన టోపీ లేదా రుమాలు పెట్టుకోవాలి
 
* ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజ్‌ కలిపిన నీరు తాగవచ్చు. లేదా ఓరల్‌ రీ హైడ్రేషన్‌ ద్రావణం తాగవచ్చు
 
* వడదెబ్బకు గురైనవారిని తడిగుడ్డతో శరీరమంతా రుద్దుతూ ఉండాలి, ఐస్‌ నీటిలో బట్టను ముంచి శరీరమంతా తుడవాలి
 
* మంచినీరు ఎక్కువసార్లు తాగాలి, ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు ఒక గ్లాసు మంచినీరు తాగాలి
 
* తీవ్రమైన ఎండలో బయటికి వెళ్లినప్పుడు తలతిరుగుట మొదలైన అనారోగ్య సమస్య ఏర్పడితే దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించి ప్రాథమిక చికిత్స తీసుకోవాలి.

* సూర్య కిరణాలు, వేడిగాలికి గురికాకూడదు. వేడిగా ఉన్న సూర్యకాంతిలో గొడుగులేకుండా తిరగకూడదు.
 
* వేసవిలో నలుపురంగు దుస్తులు, మందంగా ఉన్న దుస్తులు ధరించడం మానేయాలి.
 
* మధ్యాహ్నం తర్వాత( ఉదయం 10 గం. నుంచి సా. 4 గం. మధ్యకాలంలో) ఆరు బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పని చేయకూడదు.
 
* ఎండలో బయటి నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనె తీసుకోకూడదు.
 
* శీతలపాననీయాలు, మంచు ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్యం ఏర్పడుతుంది.

* భయట నుంచి ఇళ్లు కార్యాలయాల్లోకి వెళ్లిన వారు వెంటనే చల్లని నీరు సేవించకూడదు. ముందుగా కొంచెం బెల్లం నోట్లో వేసుకుని ఆ తరువాత కొంత సేపటికి నీళ్లు తాగాలి

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High ultraviolet radiation  heat deaths  Meteorological Organisation  

Other Articles