After war of words, Narendra Modi tweets photograph with ex-PM Manmohan Singh

Manmohan singh meets modi at laters official home

Prime Minister, Manmohan Singh, Narendra Modi, BJP, 7 race course road, modi meet manmohan, manmohan meets modi, narendra modi meets manmohan singh, Dayanidhi Maran, 2G scam, Pradeep Baijal, TRAI, A Raja, latest news, india news

Hours after former Prime Minister Manmohan Singh attacked the Centre saying it was "harping" on corruption to divert people's attention to non-issues, Prime Minister Narendra Modi tweeted a photograph with the ex-PM on Wednesday evening.

ప్రధాని మోడీతో మాజీ ప్రధాని మన్మోహన్ భేటీ

Posted: 05/27/2015 10:03 PM IST
Manmohan singh meets modi at laters official home

ఒకవైపు బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు పరస్పరం కత్తులు నూరుకుంటున్న సమయంలో ప్రధాని నరేంద్రమోదీ.. ట్విట్ యావత్ దేశ ప్రజలను విస్మయానికి గురిచేసింది. అధికార విపక్షాల మధ్య ఒక వైపు విమర్శలు, ప్రతివిమర్శలు జరుగుతున్న క్రమంలోనే ప్రధాని నరేంద్రమోడీని.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనూహ్యంగా కలిశారు. ప్రధాని అధికారిక నివాసమైన నెం.7 రేస్కోర్స్ రోడ్డుకు స్వయంగా వెళ్లిన మన్మోహన్ సింగ్ను.. నరేంద్రమోదీ సాదరంగా స్వాగతించారు. ఆయనను కలిసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, ఆయనను మళ్లీ 7 రేస్కోర్సు రోడ్డుకు పిలవడం ఆనందంగా ఉందని మోదీ ట్వీట్ చేశారు. తామిద్దరి మధ్య సమావేశం కూడా బాగా జరిగిందన్నారు.

అయితే.. బొగ్గు స్కాం, 2జీ స్కాం లాంటి విషయాలలో కాంగ్రెస్ పార్టీని, మాజీ ప్రధానమంత్రిని బీజేపీ వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ అవినీతికి పాల్పడలేదన్న విషయాన్ని తాను అంగీకరిస్తాను గానీ, ఆయన మంత్రులను కూడా నీతిమంతులుగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఆయనకుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో మోదీ- మన్మోహన్ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలావుండగా, ఇవాళ ఉదయం మీడియా సాక్షిగా మన్మోహన్‌సింగ్‌ 2జీ కుంభకోణంపై నోరు విప్పారు. తన పదవిని దుర్వినియోగం చేయలేదని చెప్పారు. ట్రాయ్‌ మాజీ ఛైర్మన్‌ బైజాల్‌ పేరు ప్రస్తావించకుండా ఆయన చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాను కానీ, తన కుటుంబం కానీ వ్యక్తిగతంగా ఎలాంటి లాభం పొందలేదని అన్నారు. ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మన్మోహన్‌ వ్యాఖ్యానించారు. మోదీ ప్రభత్వం ప్రజా సంక్షేమం కోసం కొత్తగా చేస్తున్నది ఏమీ లేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలనే పేర్లు మార్చి అమలు చేస్తోందని ఆయన విమర్శించారు ఎన్డీయే హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతోందని మన్మోహన్‌ విమర్శించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prime Minister  Manmohan Singh  Narendra Modi  BJP  7 race course road  

Other Articles