raghuveera reddy releases satirical cd adirindayya chandram on babu one year in office

Raghuveera reddy takes on tdp government

AP pcc chief Raghuveera reddy, TDP Government, One Year Mahanadu, Daganady, satirical cd, Election promises, KVP Ramachander Rao, adirindayya chandram, Anam vivekananda reddy, chiranjeevi

raghuveera reddy takes on TDP government, releases satirical cd adirindayya chandram on babu one year in office

బాబు ఏడాదిపాలనపై కాంగ్రెస్ వ్యంగ్రాస్త్రం.. అదిరిందయ్యా చంద్రం

Posted: 05/27/2015 06:28 PM IST
Raghuveera reddy takes on tdp government

చంద్రబాబు ఏడాది పాలనపై కాంగ్రెస్ విభిన్నంగా స్పందించింది. గతంలో కేవలం విమర్శలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పడు అందుకు భిన్నంగా వ్యంగాస్త్రాలను సంధించింది. చంద్రబాబు ఏడాది పాలనపై వ్యంగ్యంగా రూపొందించిన 'అదిరిందయ్యా చంద్రం' సీడీని ఇందిరాభవన్ లో కాంగ్రెస్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. ఏడాది కాలంలో చంద్రబాబు సర్కార్ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదని విమర్శించారు. టీడీపీ మహానాడు అని కాకుండా దగానాడు అని పెట్టుకుంటే బాగుండేదని సూచించారు.

చంద్రబాబుపై పోరాటంలో ఇది ఆరంభం మాత్రమేనని ఇకపై ఆయన అబద్దాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లామని రఘువీరా చెప్పారు. ఈ సీడీలను టీడీపీ కార్యాలయానికి పంపుతున్నామని చెప్పారు. మహానాడుకు హాజరయ్యే 60 మందికి ఈ సీడీని చూపించాలన్నారు. మాట తప్పుతున్న చంద్రబాబుకు ఎన్నికల హామీలను గుర్తు చేసేందుకే ఈ సీడీనీ రూపొందించామన్నారు. తెలంగాణ పర్యటించినప్పుడు తమ లేఖ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న చంద్రబాబుకు.. ఆంధ్రప్రదేశ్ కు వచ్చి రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని మొసలి కన్నీరు కార్చి ప్రజలను తప్పదోవ పట్టించారన్నారు. నిజాయితీ ఉంటే ఇదే అంశంపై మహానాడులో తీర్మానం పెట్టాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghuveera reddy  adirindayya chandram cd  

Other Articles