mumbai nurse aruna shanbaug dies 42 years after brutal rape that left her in coma

After 42 years in coma nurse aruna shanbaug dies

Aruna Shanbaug, Mumbai nurse Aruna Shanbaug, euthanasia, mercy killing, Shanbaug death,crime, sexual assault, rape, Aruna Shanbaug, Aruna Shanbaug Dies, KEM Hospital, Mumbai, Pinki Virani, Supreme Court, coma, Brutal Rape, Aruna Shanbaug rape, Aruna Shanbaug case, Aruna Shanbaug dead, Euthanasia crime against women, violenece against women, harrasment against women,

Aruna Shanbaug (67), former nurse of Mumbai's Kings Edward Memorial (KEM) Hospital who was in a coma for 42 years after a sexual assault by a wardboy in 1973, was declared dead on Monday morning.

అగిన 42 ఏళ్ల జీవన్మరణ పోరాటం.. అస్తమించిన అరుణం..

Posted: 05/18/2015 02:54 PM IST
After 42 years in coma nurse aruna shanbaug dies

42 రెండే ఏళ్లగా జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడుతున్న అరుణం అస్తమించింది. గత 42 ఏళ్లుగా కోమాలో ఉన్న అరుణా షాన్ బాగ్ (68) ఇవాళ తుదిశ్వాస విడిచారు. ముంబైలోని కింగ్‌ అడ్వర్డ్స్ మెమోరియల్‌ (కెఇఎమ్‌) ఆస్పత్రిలో ఆమె సోమవారం మృతి చెందినట్లు ఆస్పత్రి డీన్ అవినాష్ సుపే వెల్లడించారు. 1973లో అరుణా షాన్ బాగ్ 26 ఏళ్ల వయసులో వుండగా, అమె ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తుండేది. కాగా అరుణపై కన్నేసని వార్డుబాయ్ సోహన్‌ లాల్‌ వాల్మీకి విధి నిర్వహణలో ఉన్న ఆమెపై అతి దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టి, తీవ్రంగా గాయపరిచాడు. దాంతో షాక్ తిన్న అరుణా షాన్ బాగ్ కోమాలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె కోమాలోనే ఉంది.

ఆస్పత్రిలో మందులను దొడ్డిదారిన అమ్ముకుంటున్న సోహన్ లాల్ను అరుణ ప్రశ్నించటంతో పాటు అధికారుల దృష్టికి తీసుకు వెళతానని హెచ్చిరించడంతో ఆమె అత్యాచారానికి గురైంది. ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను నిర్బంధించిన వార్డు బాయ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. దాంతో మెదడు పని చేయక పోవటంతో కోమాలోకి జారుకుంది. అప్పటి నుంచి కెఇఎమ్ ఆసుపత్రిలోనే అరుణా షాన్ బాగ్ జీవచ్ఛవంగా బతుకుతోంది. ఈ నేపథ్యంలో అరుణకు కారుణ్య మరణాన్ని అర్ధిస్తూ ఆమెపై పుస్తకం రాసిన రచయిత్రి పింకీ విరానీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా అరుణా షాన్ బాగ్ సహజ మరణం ఆసన్నమయ్యేవరకూ కంటికి రెప్పలా చూసుకుంటామని ఆసుపత్రి సిబ్బంది హామీ ఇవ్వడంతో సుప్రీంకోర్టు ఆమెకు కారుణ్య మరణాన్ని నిరాకరించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aruna Shanbaug  Aruna Shanbaug Dies  coma  Brutal Rape  

Other Articles