Love locks' to be removed from Australia foot-bridge

Love locks to be removed from australia foot bridge

love locks, australia, love symbol, love locks on foot-bridge, love locks on foot bridge to be removed, Love locks, Melbourne City Council, Melbourne City foot-bridge

Over 20,000 "love locks", clipped to a foot-bridge here in Australia, will be removed due to safety concerns, a media report said on Monday.

ఆ ప్రేమ బంధనాలను తెంచేస్తాం..

Posted: 05/18/2015 02:51 PM IST
Love locks to be removed from australia foot bridge

ఆ ప్రేమ బంధనాలను తుంచేస్తాం అన్న శీర్షిక చూసి ఇది ఏదో సినిమాలో ప్రతినాయకుడు చెబుతున్న డైలాగ్ అని అనుకుంటే పోరబాటే. ఈ డైలాగ్ అధికారులది. ఔరా అధికారులకు ప్రేమ బంధనాలను తుంచే పనేంటి అని అనుకుకోబాకండి. భద్రతా కారణాలతోనే ఆ ప్రేమ బంధనాలను తుంచేస్తామని వారు ప్రకటించారు ప్రమే బంధనాలు భద్రతా కారణాలకు అవరోధంలో ఎందుకు పరిణమించాయి. అసులు ఏమా కథా.. మాకు తెలియాలి అనుకుంటున్నారా..? ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ సిటీలో వున్న సౌత్ గేట్ ఫుట్ బ్రిడ్జి పై వున్న ప్రేమ బంధనాలను తొలగించాలని మెల్ బోర్న్ సిటీ కౌన్సిల్ నిర్ణయించింది. అసలింతకీ ఆ ఫుట్ బ్రిడ్జిపై 20 వేలకు పైగా ఉన్న లాక్స్ ఎందుకు వున్నాయి..? అసలు వాటిని వరు వేశారు..? ఎందుకని వేశారు అన్న ప్రశ్నలు మీలో ఉదయిస్తుంటాయి.  

అక్కడికే వస్తున్నాం.. ఒక్క చోట ఒక్కో రకం విశ్వాసం, ఒక్కో రకం నమ్మకాలు వుంటాయి. ఈ బ్రిడ్జిపైకి చేరకుకునే ప్రేమ జంటలు అక్కడ తాళంకప్పపై తమ పేర్లు రాసి దాన్ని బ్రిడ్జికి ఉన్న తీగకు తాళం వేసి తాళంచెవిని దూరంగా విసిరేయడం ప్రేమికులకు అలవాటుగా మారింది. తమ ప్రేమ గొప్పదని నిరూపించుకునేందుకు గత మూడేళ్లుగా ప్రేమికులు ఈవిధంగా చేస్తున్నారు. దీంతో ఆ నోటా, ఈ నోటా ప్రచారం పెరగడంలో కుప్పలు తెప్పులు వచ్చిపడిన ప్రేమ తాళంకప్పులతో బరువు పెరగడంతో బ్రిడ్జి తీగ కిందకు వంగిందట.

దీంతో వీటిని తోలగించాలని మెల్ బోర్న్ సిటీ కౌన్సిల్ నిర్ణయించింది. లవ్ లాక్స్ ను తొలగించిన తర్వాత వాటిని ఎక్కడ భద్రపరచాలనే దానిపై సలహాలు ఇవ్వాలని మెల్ బోర్న్ పౌరులను మేయర్ రాబర్ట్ డొయలే కోరారు. ప్రేమ తాళంకప్పల బరువు మోయలేక 2014లో పారీస్ లోని పాంట్ డెస్ ఆర్ట్స్ బ్రిడ్జిలోని కొంతభాగం కూలిపోయింది. వంతెన కూలిపోయిన సమయంలో దానికి 7 లక్షలకు పైగా లవ్ లాక్స్ ఉన్నాయి. దీంతోనే ఆ ప్రేమ బంధనాలను తుంచేసేందుకు మెల్ బోర్న్ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుందట.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Love locks  Melbourne City Council  foot-bridge  

Other Articles