pakistan | India | kargil war

Pakistan ex president musharaf commented on india about kargil war

pakistan, India, kargil war, musharaf

Pakistan ex president Musharaf commented on India about kargil war. He said that india fear about the pakistan when the kargil war.

భారత్ గురించి ముషారఫ్ కారు కూతలు..!

Posted: 05/18/2015 02:51 PM IST
Pakistan ex president musharaf commented on india about kargil war

భారత్, పాకిస్థాన్ అనే రెండు దేశాల మధ్య పరిస్థితి ఎలా ఉంటుంది అని ఎవరిని అడిగినా.. ప్రపంచంలోని ఏ వ్యక్తైనా చెప్పే సమాధానం ఒక్కటే. పక్క గడ్డి వేసినా భగ్గు మంటుంది అని. మామూలుగా రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటేనే అదేదో పెద్ద యుద్దానికి సిద్దపడట్లు రెండు దేశాలకు చెందిన వారు సిద్దమవుతారు. మ్యాచ్ చివరి క్షణం వరకు తమ దేశమే గెలవాలని కోరుకుంటారు. గెలిచిన దేశం చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అయితే రెండు దేశాలు విడిపోయిన దగ్గని నుండి పాకిస్థాన్ భారత్ పైకి యుద్దానికి ప్రతీసారి కాలు దువ్వుతూ ఉంటుంది. బోర్డర్ దాటి ఎప్పుడూ ఉగ్రవాదులు కాల్పులకు తెగపడుతునూ ఉంటారు. అయితే భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన కార్గిల్ యుద్దం రెండు దేశాల చరిత్రల్లో నిలిచిపోయింది. అయితే తాజాగా నాటి కార్గిల్ యుద్దం గురించి మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చేసిన వ్యాక్యలు మరోసారి వివాదానికి తెర తీవాయి.

బారత్ తో 1999 కార్గిల్ యుద్దానికి పాకిస్థాన్ సిద్దపడింది. కార్గిల్ భూభాగాన్ని ఆక్రమించుకొని పాక్ జెండాను ఎగరవేసింది. అయితే ఎంతో కష్టపడి భారత సైనికులు పోరాడి భారత భూభాగాలను కైవసం చేసుకుంది భారత్. అయితే నాటి కార్గిల్ యుద్దంలో భారత్ కు ముచ్చుమటలు పట్టించమంటూ పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తెలిపారు. కార్గిల్ ప్రాంతానికి చేరుకున్నామని, ఆ సమయంలో భారత్ కుత్తుక పట్టుకున్నామని పొగరుబోతు మాటలు.. మదమెక్కిన మాటలు మాట్లాడారు ముషారఫ్. భారత్ పై మేము విజయం సాధించాం అంటూ చరిత్రను మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు పర్వేజ్. అయితే భారత్ కాస్త ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే కానీ యావత్ భారత్ ఒక్కతాటిపై నిల్చిన విదానాన్ని మాత్రం ముషారఫ్ మరిచిపోయాడు అంటూ కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా ఆడలేక మద్దెలు బాగొలేవు అన్న చందాన.. అంతా ముగిసి, యుద్దం అయిపోయిన తర్వాత ఏం మాట్లాడితే మాత్రం ప్రయోజనం.

*అబినవయారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  India  kargil war  musharaf  

Other Articles