Baby buried alive for 8 days by parents in China

China baby survives eight days buried alive reports

China baby survives eight days buried alive, Baby buried alive for 8 days by parents in China, china, baby survivor, murder, crime against children, village residents, baby boy, remote area, covered rocky ground, ,,,China, Zhao Shimin, newborn baby, police custody, Pic shows, police officers, china, baby survivor, murder, crime against children, cleft lip

A Chinese baby born with a cleft lip was abandoned by his parents and buried in a cardboard box two days later, but rescued alive eight days further on, media reported.

మృత్యుంజయుడు.. కన్నవారు సజీవ సమాధి చేసినా బతికాడు..

Posted: 05/13/2015 09:16 PM IST
China baby survives eight days buried alive reports

కసాయి తల్లదండ్రులు తమ రోజుల బిడ్డపై వున్న మమకారాన్ని చంపుకున్నారు. సజీవంగా సమాధి చేశారు. కానీ ఆ మృత్యుంజయుడు చిరంజీవిగా మారాడు. ఎనమిది రోజులైనా తాను సజీవంగా సమాధిలోంచి భయపడి నోట్లో పడిన మట్టిని ఉమ్ముతున్నాడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని పెద్దలు చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తుకువస్తున్నాయి. ఇది విచిత్రం కాకపోతే 8 రోజలుగా రోజుల వయస్సున్న పురటి బిడ్డ సజీవంగా వుండడం వింతగానే భావిస్తున్నారు స్థానికులు. ఇంతకీ ఈ విచిత్రం ఎక్కడ చోటుచేసుకుందో తెలుసా.. ?. చైనాలో..

గ్రహణం మొర్రితో పుట్టిన ఆ బాలుడిని తల్లిదండ్రులు ఓ చెక్క పెట్టెలో పెట్టి భూమిలో పూడ్చేశారు. అదృష్టవశాత్తు ఆ చెక్కపెట్టెలోకి కొంత గాలి, నీరు మాత్రం వెళ్లాయి. బూట్లు పెట్టుకునే పరిమాణంలో ఉన్న బాక్సులో ఆ చిన్నారిని కప్పిపెట్టారు. అయితే, 8 రోజుల తర్వాత అటువైపు మూలికల కోసం వచ్చిన ఓ మహిళకు అబ్బాయి ఏడుపు వినిపించడంతో అనుమానం వచ్చి తవ్వి చూసింది. వెంటనే బయటకు తీసి సమీపంలో ఉన్న ఆస్పత్రిలో చేర్చింది. వైద్యులు పరీక్షించేసరికి ఆ అబ్బాయి నోట్లోంచి మట్టి ఉమ్ముతున్నాడు.

పిల్లాడిని కావాలని హతమార్చే ప్రయత్నం చేశారన్న నేరం కింద ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన చైనాలోని దక్షిణ ప్రావిన్సులో గ్వాంగ్సీలో చోటచేసుకుంది. చైనాలో ఇలాంటి అవకరాలు ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులు ఎలాగోలా వాళ్లను వదిలించుకోడానికే ప్రయత్నిస్తుంటారు. అక్కడ కుటుంబ నియంత్రణ నిబంధనలు గట్టిగా ఉండటం, ఇలాంటి పిల్లల వైద్య ఖర్చులు భరించలేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  baby survivor  murder  crime against children  

Other Articles