badangpet commissioner | anti corruption bureau | red handed

Badangpet commissioner in acb net

badangpet commissioner, anti corruption bureau, red handed, saroor nagar mandal, commissioner trileshwar rao, badangpet senior assistant Naresh, 72 thousand, contractor srinivas reddy, rangareddy distict, telangana

badangpet commissioner cautht red handedly by anti corruption bureau officials

నగ్నంగా దొరికిపోయారు.. లంచావతారాలు

Posted: 05/13/2015 09:11 PM IST
Badangpet commissioner in acb net

ప్రభుత్వ ఉద్యోగాలు దొరకడం గత జన్మ పుణ్యఫలమేనంటుంటారు కొందరు. అది నిజమో కాదో తెలియదు కానీ, ఉద్యోగాలు దోరికేంద వరకు నిరుద్యోగుల బాధలను అనుభవించిన యువకులు.. ఉద్యోగం లభించగానే వాటిని పూర్తిగా మర్చిపోయి.. లంచాలు తీసుకుంటూ ముప్పూటలా భోజనాలు కూడా మని లంచాలనే మేస్తుంటారు కొందరు అధికారులు. మేము చాలా కష్టాలను అనుభవించాం.. వాటి గురించి మావద్ద ప్రస్తావన తీసుకురావద్దని అంటూనే లంచం ఉంటే తప్ప నోట మాట కూడా జాలువారనీయకుండా జాగ్రత్త పుడుతుంటారు. ప్రతీ పనిలోనూ కక్కర్తి పడి.. జాలీ, దయ, మానవత్వం అనేవి ఏ కోశాన లేకుండా అందిన చోటల్లా.. అందిన మేర మేసేస్తూ.. నీతి సూక్తులు మాత్రం బొలడెన్ని చెప్పేస్తుంటారు. అలాంటి ఇద్దరు లాంచావతారాలు అవినీతి నిరోధక శాఖ అధికారులకు నగ్నంగా దోరికిపోయారు.

సరూర్ నగర్ మండలం బడంగ్పేట నగర పంచాయతీపై  దాడి చేసిన ఏసీబీ అధికారులు కమిషనర్ త్రిలేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్ నరేష్ ను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దనూ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.72వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి రూ.23,57,752 బిల్లు మంజూరు కోసం ఎన్.శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టర్ నుంచి కమిషనర్, సీనియర్ అసిస్టెంట్ ఇద్దరూ కలిపి 3 శాతం కమిషన్, సుమారు రూ.72వేలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం నెలరోజులుగా కాంట్రాక్టర్‌ను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నట్టు సమాచారం. ముందుగా డబ్బులు వెచ్చించి కాస్తో, కూస్తో వచ్చే లాభంతో తమ సంసారాలను పోషించుకునే కాంటాక్టర్లకు వారి బిల్లులను ఇచ్చేందుకు కూడా కమీషన్లను డిమాండ్ చేయడం భావ్యమా..? మీరే చెప్పండి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : badangpet  commissioner  anti corruption bureau  

Other Articles