Narayan Sai sexual assault case: Key witness shot at in Panipat

Eyewitness in asaram son s case shot at in haryana

Narayan Sai sexual assault case: Key witness shot at in Panipat, Narayan Sai, Asaram Bapu, eyewitness, Mahender Chawla, shot, Asaram Bapu, Asaram witness attacked, Asaram Bapu witness, Asaram rape case, Narayan Sai

A 35-year-old witness in Narayan Sai case was shot at and critically injured at Panipat in Gurgaon on Wednesday. He is said to be unfit for statement.

ఆశారం తనయుడు నారాయణసాయి కేసులో ప్రధాన సాక్షిపై కాల్పులు..

Posted: 05/13/2015 09:36 PM IST
Eyewitness in asaram son s case shot at in haryana

సూరత్ అత్యాచారం కేసులో  ప్రధాన సాక్షి మహేందర్ చావ్లాపై గుర్తు తెలియని  దుండగులు  కాల్పులు జరిపారు. చండీగఢ్, పానిపట్టు జిల్లా సానౌలి గ్రామంలో  మహేందర్  ఇంటి దగ్గర  దుండగులు అతనిపై కాల్పులు జరిపారు.  దీంతో తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. వెన్నులో రెండు బుల్లెట్లు దిగాయని, ప్రస్తుతం  చావ్లా పరిస్థితి ప్రమాదకరంగా ఉందని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూరత్ అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు, ఆశారాం బాపు కుమారుడు, నారాయణ సాయికి గత రెండు వారాల క్రితమే గుజరాత్ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది.  దీంతో   ఈ  కాల్పులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు వివిధ ప్రాంతాల్లో దాడులు  కొనసాగుతున్నాయని, దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని  పోలీసులు తెలిపారు.
 
2001- 2005 మధ్య కాలంలో ఆశారాం బాపు కుమారుడు నారాయణసాయి తనపై పలు సార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ గుజరాత్లోని సూరత్ నగరంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే 2000 సంవత్సరంలో ఆశారాం బాపు ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న తమపై  బాపు, ఆయన కుమారుడు నారాయణ సాయి అత్యాచారం చేశారని గుజరాత్కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు పోలీసు స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదుచేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్, పంజాబ్, ఢిల్లీ పోలీసుల సంయుక్తంగా  గాలింపు చర్యల్లో భాగంగా నారాయణ సాయిని, ఆశారాం బాపును గత రెండేళ్ల క్రితం అరెస్ట్ చేసి.. రిమాండుకు తరలించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asaram Bapu  Asaram witness attacked  Asaram Bapu witness  Asaram rape case  Narayan Sai  

Other Articles