paternity case for a new jersey mother of twins bears unexpected results two fathers

Twins have different fathers judge finds in paternity case

Twins, paternity test, Passaic, Paternity Case, New Jersey Mother, Twins, Two Fathers, Twins, different fathers, paternity, sperm, can twins have two different fathers, New Jersey,

A paternity case involving a set of twins had a surprise ending worthy of a daytime TV talk show: The girls have different dads.

ఇదేం విచిత్రం.. కవల పిల్లలే కానీ తండ్రులు వేరయా..!

Posted: 05/09/2015 08:06 PM IST
Twins have different fathers judge finds in paternity case

ఓ తల్లి గర్భం నుంచి కొన్ని సెకన్ల తేడాతో జన్మించిన కవల పిల్లలే వాళ్లు. అయితే వాళ్ల తండ్రి మాత్రం ఒక్కరు కాదు. ఇద్దరు పిల్లలకు ఇద్దరు తండ్రులు. దిగ్ర్భాంతికి గురిచేసే ఈ విచిత్రమైన అసాధారణ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం తన భార్య ద్వారా జన్మించిన కవలల్లలో ఒకరికే తాను తండ్రిని, ఆ పిల్లాడి సంరక్షణ బాధ్యత మాత్రమే చూస్తానని తండ్రి స్పష్టం చేశాడు. తల్లి మాత్రం ఇద్దరి సంరక్షణ చూడాలని పట్టుబట్టింది. పితృత్వ గొడవ కోర్టు దాకా వెళ్లింది.

కోర్టు రికార్డుల్లో భర్త పేరును 'ఏ ఎస్'గా, భార్య పేరును 'టీ ఎమ్'గా నమోదు చేశారు. కోర్టులో భార్యభర్తలు తమ వాదనే నిజమని చెప్పారు. అయితే భార్య జరిగిన విషయాన్ని వెల్లడించింది. ఒకే వారంలో భర్తతో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తితో శృంగారంలో పాల్గొన్నట్టు చెప్పింది.  డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా, ఇద్దరు కవలలకు తండ్రి ఒకరు కాదని, వేర్వేరని తేలింది. రుతుస్రావ సమయంలో ఆమె వారం వ్యవధిలో ఇద్దరితో శృంగారంలో పాల్గొనడం వల్ల ఇద్దరి ద్వారా తల్లి అయినట్టు వైద్యులు పేర్కొన్నారు. వైద్య శాస్త్రంలో ఇది అరుదైన సంఘటన అని  చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paternity Case  New Jersey Mother  Twins  Two Fathers  

Other Articles