Abhijeet Bhattacharya apologises for his controversial tweet

Singer abhijeet bhattacharya apologizes for insensitive tweet

salman khan, twitter, abhijeet bhattacharya, Salman Khan, Uttar Pradesh, Muslim, Bharatiya Janata Party, BJP MP Sadhvi Prachi, VHP leader Sadhvi Prachi, hit-and-run case, salman to move to bombay high court, Salman Khan to challange sessions court judgement, salman khan, hit and run case, hit and run, salman khan hit and run, hit n run, hit n run case, salman, salman khan cases, salman khan court, salman, actor salman khan, salman khan controversies, entertainment news,

Bollywood playback singer Abhijeet Bhattacharya has profusely apologized for his controversial statement on Salman's verdict.

సల్మాన్ పై అభిమానమే అలాచేయించింది.. క్షమించండీ

Posted: 05/09/2015 06:22 PM IST
Singer abhijeet bhattacharya apologizes for insensitive tweet

బాలీవుడ్ ప్రముఖ నటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ముంబై సెషన్స్ కోర్టు ఐదేళ్ల శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించడంతో బాధతప్త హృదయుడినై చవకబారు వ్యాఖ్యలు చేశానని బాలీవుడ్ గాయకుడు అభిజిత్ అన్నారు. సల్మాన్ ఖాన్ పై వున్న అభిమానంతోనే తానా వ్యాఖ్యలను చేశానని, ఎవరినీ ఉద్దేశించి కాదన్నారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం.. వాటిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో నాలుక కరుచుకన్న ఆయన.. ఎట్టకేలకు దిగివచ్చి.. క్షమాపణలు చెప్పారు.

‘‘రోడ్లమీద పడుకునేది కుక్కలు తప్ప మనుషులు కాదు... అలా పడుకునే వారు కుక్కచావే చస్తారు. ఇళ్లు లేనంత మాత్రాన రోడ్లమీద పడుకోకూడదు’’ అంటూ అభిజిత్‌ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ వాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. అభిజిత్‌ వ్యాఖ్యలపై కేసు కూడా నమోదు అయింది. దాంతో అభిజిత్‌ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యల్లో పరుషపదాలు ఉపయోగించినందుకు క్షమాపణ చెప్పారు. సల్మాన్‌ ఖాన్‌ దృష్టిలో పడడం కోసం అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

ఆయనపై వున్న అభిమానం అలా చేయిందని చెప్పారు. అయితే తాను సల్మాన్‌పై దొంగ ప్రేమ చూపిస్తున్న వారికి, హై-ఫై మనుషులకి, మేడం డే వంటి రచయితలకు... కపూర్‌ వంటి నటులకు క్షమపణ చెప్పడం లేదని, వాళ్లందరూ మోసగాళ్లని, వాళ్లు ఏమీ చేయరని, మొసలి కన్నీళ్లు మాత్రం కారుస్తారని విమర్శించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  twitter  abhijeet bhattacharya  Hit and run case  

Other Articles