Bride refuses to marry drunk groom in Madhya Pradesh's Singrauli district

Bride refuses to marry inebriated groom

Bride refuses to marry drunk groom, Bride refuses to marry inebriated groom, inebriated condition, drunk groom, Bride refuses to marry, Madhya Pradesh, Singrauli district, Rajmilan village, Sanjay, Rambharose Shah, Sector 3, Singrauli town, Navjivan Vihar locality,

A bride in Madhya Pradesh has refused to marry a groom who reached the marriage venue in an inebriated condition on Friday night.

పీటల మీద పెళ్లి వద్దని వెళ్లిపోయిన పెళ్లికూతరు..?

Posted: 05/09/2015 09:18 PM IST
Bride refuses to marry inebriated groom

తమ జీవిత భాగస్వామి ఎలా వుండాలో.. ఎలా వుండకూడదో నిశ్చితార్థానికి పెద్దల ఆచారాలు, సాంఘీక కట్టుబాట్ల మధ్య పెదవి విప్పి చెప్పడానికి వెనకంజ వేస్తున్న యువతులు.. పెళ్లి కోడుకు అందంగా వున్నాడంటే చాలునని సంతోషించి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్య మాత్రం వారు తెగేసి కోన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారు తీసుకున్న నిర్ణయాలు చాలా వ్యయంతో కూడుకున్నవే అయినా.. వాటికి వధువుల తల్లిదండ్రులు, బంధువులు కూడా కాదనలేకపోతున్నారు. ఈ మద్యకాలంలో ఇలాంటి ఘటనలు అక్కడక్కడా వెలుగులోకి వస్తున్నాయి

పెళ్లి అనగానే వరుడి స్నేహితులు, బ్యాచిలర్ పార్టీ చేసుకోవడం మామూలే. కానీ.. సొంత పెళ్లిలో ఎవరైనా తాగుతారా? అంటే సామాన్యంగా ఎవరు తాగరు. కానీ అలా చేసినందుకు ఆ వరుడు.. వరుడిగానే మిగిలిపోవాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో తన పెళ్లికు పీకల వరకు మందుకోట్టి వచ్చిన ఓ వరుడిని చూసి కంగారు పడిన పెళ్లికూతురు.. అతనిని పెళ్ల చేసుకోడానికి నిరాకరించింది. వరుడికి సరిగ్గా కూర్చునేందుకు కూడా కావడం లేదు. దీంతో పెళ్లీ పీటలపై నుంచి లేచి వెళ్లిన వధువు తన తల్లికి చెప్పింది. దీంతో కంగారు పడిన తల్లి తమ తరపు బంధువులకు విషయాన్ని తెలిపింది. కాగా వరుడిని స్నానం చేయించి కోద్ది సేపు పడుకోబెట్టిన తరువాత కూడా వరుడి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. దీంతో పెద్దలు కూర్చోన్ని పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు చెప్పారు.

మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలి జిల్లా రాజ్ మిలన్ గ్రామంలో గత శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో సింగ్రౌలి పట్టణంలోని మూడవ సెక్టార్ లో గల నవ్ జీవన్ విహార్ ప్రాంతంలో నివసించే వరుడు సంజయ్, అతని తండ్రి రాం భరోస్ షా సహా వరుడి బందుమిత్రులు ఉస్సర్రూ మంటూ వెనుదిరిగారట. అయితే పెళ్లిలో ఎలాంటి ఘర్షణ లేకుండా శాంతియుతంగా తాము సమస్యను పరిష్కరించుకున్నామని ఇరువర్గాల వారు చెప్పారు. అయితే వధువుతో పెళ్లి ఇష్టంలేకే తాను ఇలా పీకల వరకు తాగానని, మద్యం సేవించడం ఇదే తొలిసారని వరుడు చెప్పడం కోసమెరుపు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : marriage spoiled  groom drunk  bride refused  

Other Articles