బాలీవుడ్ ప్రముఖ నటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో మహారాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం బోంబే హైకోర్టు ముంబాయి సెషన్స్ కోర్టు వెలువరించిన తీర్పును ఎందుకు సస్పెండ్ చేసింది..? సల్మాన్ ఖాన్ తరపున ఆయన తరపు న్యాయవాది అమిత్ దేశాయ్ న్యాయస్థానంలో ఏం వాదనలు వినిపించారు.? వాటికి న్యాయస్థానం ఎలా ఏకీభవించింది..? అన్న సందేహాలే ఇప్పడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సల్మాన్ ఖాన్ న్యాయవాది అమిత్ దేశాయ్ కోర్టులో వాదనలు వినిపిస్తూ.. సెషన్స్ కోర్టులో సల్మాన్ కేసులో విచారణ సక్రమంగా సాగలేదని వాదించారు. ఈ కేసు వివరాలను ఆయన శుక్రవారం ముంబై హైకోర్టు జడ్జి ముందు ఉంచారు. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేయాలని అమిత్ దేశాయి ఈ సందర్భంగా జడ్జిని కోరారు.
2002లో ముంబైలోని సబర్బన్ బాంద్రా ప్రాంతంలో పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపైకి తన వాహనంతో దూసుకెళ్లి ఒకరి మృతికి, నలుగురు గాయాలపాలవ్వడానికి కారణమైన కేసులో సల్మాన్ ఖాన్ కావాలని హత్యచేసినట్లుగా కోర్టు అభియోగాలను నమోదు చేయడంపై అమిత్ దేశాయ్ వాదించారు. ఆ రోజు జరిగింది కేవలం యాక్సిడెంట్ మాత్రమే అని, చావుకు కారణమయ్యారనే అభియోగాలను తొలగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రమాద కేసులో తొలిసారిగా ఈ సెక్షన్లను విధించడంపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తన వాదనలను వినిపించారు.
ఈ కేసులో నాలుగో వ్యక్తి సాక్ష్యాన్ని కూడా కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, సల్మాన్‌తో పాటు కారులో ఉన్న బంధువు కమాల్ ఖాన్ వాంగ్మూలం ఎందుకు రికార్డు చేయలేదనే అంశాన్ని అమిత్ దేశాయి లేవనెత్తారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం నలుగురు వ్యక్తులున్నారన్నారు. నలుగురు కూడా ప్రత్యక్ష సాక్షులని, దీనిని కింద కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పోలీస్ అధికారుల ముందు ఇచ్చిన సాక్ష్యాలు పొంతన లేకుండా ఉన్నాయన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 90 నుంచి 100 కిలోమీరట్ల వేగంగా ప్రయాణించిందని సాక్షి చెబుతున్నారని, అయితే హోటల్ నుంచి ఘటనా స్థలానికి రావటానికి 30 నిమిషాలు పట్టిందని, దూరం 14 కిలోమీటర్ల మాత్రమే అన్నారు. సల్మాణ్ ఖానే కారు నడుపుతున్నారని ఎవరూ నిరూపించలేకపోయారని అమిత్ దేశాయి వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న తరువాత బోంబే హైకోర్టు సల్మాన్ పై కింది కోర్టు వెలువరించిన తీర్పును సస్పెండ్ చేసింది
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more