Police | Eamcet | Tranport

Police serve to students who writes eamcet police providing free transport for students on eamcet exam

Police, Eamcet, Tranport, Ap, Telangana

police serve to students who writes eamcet. Police providing free transport for students on eamcet exam.

మా మంచి పోలీసులు.. అందుకే హాట్సాఫ్

Posted: 05/08/2015 01:45 PM IST
Police serve to students who writes eamcet police providing free transport for students on eamcet exam

పోలీస్.. ఖాకీ డ్రెస్సేసుకొని అన్యాయానికి ముందు ఉండి న్యాయాన్ని గెలిపించే వారు. తప్పు చేసిన వారి మక్కెలిరగదన్నే వారు.. తమ లాఠీలతో ప్రతాపాన్ని చూపించి.. ఎలాగైనా న్యాయం చేసే వాళ్లు. అయితే పోలీసులు అంటేనే కాస్త భయపడేలా ప్రవర్తించడం.. ఎవరితోనైనా కాస్త దురుసుగా మాట్లాడుతూ మామూలు జనానికి దూరంగా ఉన్నట్లు అనిపించే పోలీసులు ఈ మధ్య ప్రశంసలు పొందుతున్నారు. పోలీసులు జనానికి దూరంగా కాకుండి జనానికి దగ్గరగా ఉండాలని.. సిటిజన్ పోలీసింగ్ ను పెంచేలా పోలీస్ వ్యవస్థ పావులు కదుపుతోంది. అందులో భాగంగా గత కొన్ని రోజులుగా చేస్తున్న చర్యలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. విదేశాల్లోలాగా ఎలాంటి సహాయం కావాలనుకున్నా నిర్భయంగా పోలీస్ లను ఆశ్రయించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

తెలంగాణలో ఇంటర్, పది పరీక్షల సమయంలో పోలీసులు పెద్ద పెద్ద కటౌట్ లతో ఆల్ బెస్ట్ చెబుతూ నిల్చోవడం అప్పట్లో వార్తలకెక్కింది. చాలా చోట్ల మంచి నీటి కొసం వసతి ఏర్పాటు చెయ్యడం.. అనేక సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం చేస్తున్నారు పోలీసులు. అయితే తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బంద్ పాటిస్తోంది. దాంతో బస్సులు తిరగక ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు. ఏపి ఎంసెట్ ఈ రోజు నిర్వహిస్తుండటంతో అటు విద్యార్థులు, ఇటు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. అయితే పోలీసులు వారికి బాసటగా నిలిచారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 కు ఫోన్ చేస్తే వాలి పోయే పోలీసులు.. ఎంసెట్ విద్యార్థుల కోసం వాలిపోయారు. విద్యార్థులను ఎంసెట్ కోసం పరీక్షా కేంద్రాల వద్ద వదిలి పెద్ద మనసును చాటుకున్నారు. సో పోలీస్ వాళ్లకు హాట్సాఫ్..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Eamcet  Tranport  Ap  Telangana  

Other Articles