turkish | kolaveri di | Cococola

Turkish version of kolaveri di is exteremly catchy

turkish, kolaveri di, Dhanush, Add, Youtube, Turky

you thought Kolaveri Di was a thing of the past, you are mistaken. Coca Cola's latest Turkish campaign will prove you wrong. Just like the original, the Turkish cover will creep into the nerves of your brain and stay there for days.

ITEMVIDEOS: కోకాకోలా కొలవరి డీ

Posted: 05/08/2015 04:30 PM IST
Turkish version of kolaveri di is exteremly catchy

కొలవరి.. కొలవరి డి అనే పాట యావత్ భారతాన్ని ఓ ఊపు ఊసేసింది. 3 సినిమా కొసం ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ఈ పాటను కంపోజ్ చేశారు. ఆ మధ్య ఎక్కడికి వెళ్లినా కొలవరి పాటనే వినిపించింది అంటే పాట ఎంతలా పాపులర్ అయిందో అర్థమవుతోంది. అయితే ఇప్పుడు ఈ పాట ఏకంగా దేశాలు దాటి మరీ ప్రయాణించింది. ఏకంగా ప్రముఖ కూల్ డ్రింక్ కంపెనీ కోకాకోలా కంపెనీ యాడ్ కోసం ఈ కొలవరి డీ పాటను వాడుకున్నారు. టర్కిష్ భాషలో వచ్చిన ఈ యాడ్ ఇప్పుడు నెట్ లో తెగ హల్ చల్ చేస్తోంది. ఆ యాడ్ పై మీరూ ఓ లుక్కెయ్యండి.

ధనుష్.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ సంచలన సాంగ్ కొలవరి డీ..ఇప్పుడు టర్కిష్ భాషమార్చుకుని కోకాకోకాలో యాడ్ గా రూపొందింది. 2011 సాంగ్ ‘కొలవరి డీ.. సాంగ్ ఒకప్పుడు సోషల్ మీడియాలో సంచలన మైంది.. ఇప్పుడు మళ్లీ టర్కిష్ భాషలో కోకాకోలా .. కొత్త యాడ్ కు ప్రాణం పోసింది. టర్కిష్ భాషలో కొలవరి డీ.. సంచలనం సృష్టిస్తోంది. శీతల పానీయాల కంపెనీ కోకాకోలా టర్కీలో తమ కొత్త యాడ్ కోసం ‘కొలవరి డీ’ని వాడుకుంటోంది. 2 నిముషాల 48 సెకన్లు ఉన్న కమర్షియల్ యాడ్.. టర్కీ భాషలో “అక్ బీర్…కోకా..కోలా.. కోకా కోలా.. కోకా కోలా..’’ అని సాగుతుందట. ధనుష్ ఒరిజినల్ సాంగ్..వీడియోను ఒక వారంలో 35 లక్షలమంది వీక్షించారు. నాలుగేళ్లలో యూట్యూబ్ లో 9కోట్ల 20 లక్షలమందికి పైగ వీక్షించారు. ఇప్పుడు టర్కిష్.. ‘కొలవరి డి’ వీడియోను నాలుగు రోజుల్లో 13 లక్షలమంది వీక్షించారట.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : turkish  kolaveri di  Dhanush  Add  Youtube  Turky  

Other Articles