Dacoits gangrape 2 women, hold villagers hostage | Rajasthan | Karanpur | Karauli district

Dacoits gangrape 2 women hold villagers hostage

Dacoits gangrape 2 women, National News,Mukesh, Dacoits gangrape 2 women, hold villagers hostage in Rajasthan, six dacoits, Karanpur area, Karauli district, dacoits opened fire to create panic, SP Karauli Yogesh Yadav, Mukesh Gurjar, dacoit Dhaniram

Two women were allegedly gangraped by six dacoits who beat up and held their male family members and other villagers hostage in Karanpur area of Karauli district in the wee hours today.

రాజస్థాన్ లో బంధిపోట్ల దారుణం.. ఇద్దరు వివాహితలపై గ్యాంగ్ రేప్

Posted: 04/28/2015 10:12 PM IST
Dacoits gangrape 2 women hold villagers hostage

రాజస్థాన్లో మరో దారుణం జరిగింది. గ్రామాలపై బడి దోచుకుని వెళ్లే బందిపోట్లకు కూడా ఆడవారంటే అలుసైపోయింది. ఇవాళ వేకువ జామున ఓ గ్రామంలోకి చోరబడ్డ ఆరుగురు బందిపోట్లు.. గ్రామంలోని ఓ ఇంట్లోని కుటుంబ సభ్యులను, బంధించి ఇద్దరు వివాహితలపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఇతర గ్రామస్తులు ఎవరు వారికి సాయంగా రాకుండా అందరినీ బందించారు. కుటుంబ సభ్యుల ఎదుటే ఇద్దరు వివాహిత మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని కరౌలి జిల్లా కరన్పూర్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున దుశ్చర్య జరిగింది.

పీకల వరకు మధ్యం సేవించి కరన్పూర్ ప్రాంతంలోని ఓ గ్రామంలోకి చోరబడిన బందిపోటు దొంగలు నేరుగా ఓ ఇంట్లోకి వెళ్లి మగవాళ్లను బంధించారు. ఇద్దరు వివాహితులపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారు కాపాడండీ అంటూ కేకలు వేయడంతో గ్రామంలోని మిగతా వారు రాకుండా అడ్డుకున్నారు. ఓక దశలో గ్రామస్థులను బెదిరించేందుకు ఓ దోంగ కాల్పులు జరపడంతో.. అది గురి తప్పి మరో దోంగకు తగలడంతో ముఖేస్ గుర్జార్ అనే దోంగ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇదే అదనుగా చేసుకుని గ్రామస్థులు దోంగలపై తిరగబడటంతో వారు పలాయనం చిత్తగించాగా, ధనిరామ్ అనే బందిపోటు దోంగ మాత్రం గ్రామస్తులకు చిక్కడంతో వారు అతడిని బందించి పోలీసులకు అప్పగించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dacoits  gangrape  hostage  2 women  

Other Articles