Thankyou India for the blank cheque | Dilip Kumar upadhyay | Nepals' ambassador

Thankyou india for the blank cheque

Thankyou India for the blank cheque, Nepal, India, blank cheque Dilip Kumar upadhyay, Nepals' ambassador to India,Indian government, in favor of Nepal, nepal disastrous calamity,

Dilip Kumar upadhyay, Nepals' ambassador to India, said that India has offered them a blank cheque and thanked the Indian government for signing a blank cheque in favor of Nepal to help the nation in need after the disastrous calamity

భారత్ ఉదారత.. బ్లాంక్ చెక్ కు ధన్యవాదాలు..

Posted: 04/28/2015 09:25 PM IST
Thankyou india for the blank cheque

భూతల సర్గం అకస్మాత్తుగా మర్మభూమిగా మారి.. ఎక్కడ చూసినా శిధిలాలు, వాటి కింద నేపాలీయులు వుండటంతో భారత్ వారికి ఆపన్న హస్తాన్ని అందించింది. ఓ వైపు సహాయక చర్యలు చేపట్టేందుకు ఆర్మీ సహా ఎన్ ఆర్ ఎల్ డీ దళాలను నేపాల్ కు పంపిన భారత్.. మరో వైపు మందులు, ఆహారపదార్థాలను కూడా పంపింది. అంతేకాదు అక్కడి ప్రజలకు వైద్యం అందించేందుకు ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులను కూడా ప్రభావిత ప్రాంతాలకు పంపింది. దీంతో పాటు తన ఔదార్యాన్ని చాటుకునేందుకు ఎన్నడూ లేని విధంగా మరో సాయం కూడా చేసింది.

నేపాల్ భూకంపం నేపథ్యంలో సహాయ నిమిత్తం భారత ప్రభుత్వం బ్లాంక్ చెక్ ఇచ్చిందని, అందుకు భారత ప్రభుత్వానికి తమ దేశం రుణపడి ఉంటుందని నేపాల్ రాయబారి దిలిప్ కుమార్ ఉపాధ్యాయ్ అన్నారు. టెంట్లు, మెడికల్ కిట్లు వారికి చాలా అవసరమని, భూ ప్రకంపనలతో నేపాల్ ప్రజలు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. పరిస్థితి కుదుట పడేందుకు మరో 6రోజులు పడుతుందని అభిప్రాయపడ్డారు. అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ఎక్కువ సంఖ్యలో వైద్యసాయం ఇవ్వాలని భారత్ ని కోరినట్లు నేపాల్ రాయబారి దిలిప్ కుమార్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ambassador dileep kumar upadhyay  india blank cheque  nepal eath quake  

Other Articles