APSRTC | TSRTC | RTC | Bifercation

Apsrtc biferication completed for telangana and andhrapradesh

APSRTC, TSRTC, RTC, Bifercation, Sambashiva Rao,

APSRTC biferication completed for telangana and andhrapradesh. APSRTC divided into apsrtc and tsrtc. The RTC M.D sambha shivarao announced that apsrtc biferication completed.

ఆర్టీసీ విభజన పూర్తి.. ఇక రెండు రాష్ట్రలకు వేరువేరు

Posted: 04/29/2015 07:44 AM IST
Apsrtc biferication completed for telangana and andhrapradesh

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ)లో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయింది. మే 14 నుంచి రెండు రాష్ట్రాలకు సంబంధించిన పరిపాలనా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఏపీకి సంబంధించి ఏపీఎస్‌ఆర్‌టీసీగా, తెలంగాణకు సంబంధించి తెలంగాణ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్‌ (టీఎస్‌ఆర్‌టీసీ)గా గుర్తించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండి సాంబశివరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేడర్‌కు చెందిన ఉద్యోగులను ఆ జిల్లాకే కేటాయించారు. ఎగ్జిక్యూటివ్‌ స్థాయి అధి కారుల్లో 6 మందిని ఏపీకి, నలుగురిని తెలంగాణకు కేటాయించారు. బస్సు భవన్‌ను రెండు బాగాలుగా విభజించారు. ఏ బ్లాక్‌ను ఆంధ్రప్రదేశ్‌కు, బీ బ్లాక్‌ను తెలంగాణకు కేటాయించారు. ఏపీఎస్‌ఆర్‌టీసిీ ఎండిగా సాంబశివరావు, తెలంగాణ ఆర్టీసీ ఎండీగా రమణారావును నియమించారు.

రాష్ట్ర విభజన జరిగిన 9 నెలల తర్వాత కూడా సంస్థను విభజిం చకపోవడంతో పెద్దఎత్తున విమర్శలు తలెత్తిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాలకు చెందిన కార్మిక సంఘాలు కూడా వెంటనే సంస్థను విభజిం చాలని ఇరు రాష్ట్రాల రవాణా శాఖల మంత్రులు, సంస్థ ఎండీకి వినతిపత్రాలు సమర్పించారు. తెలంగాణకు చెందిన సంఘాలైతే ఆందోళనలు కూడా చేశాయి. ఆలస్యంగానైనా సంస్థలో ఉద్యోగు ల విభజన ప్రక్రియ పూర్తి కావడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తంచేశారు. ఆస్తుల విభజనలో ఉద్యోగుల మధ్య విబేధాలు తలెత్తాయి. ఉమ్మడి రాష్ట్రంలోని ఆస్తులను రెండు రాష్ట్రాలకు పంచాలని ఏపీ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తెలంగాణ సంఘాలు ససేమిరా అంటున్నాయి. మా రాష్ట్రానికి చెందిన ఆస్తులు ఏపీకి ఎలా కేటాయిస్తారని మండి పడుతున్నాయి. ఆస్తులు, అప్పులకు సంబంధించి ప్రత్యేకంగా షిలాబిడే కమిటీని వేసినందున కమిటీ ఇచ్చే నివేదిక మేరకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే రెండు, మూడు నెలల్లో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : APSRTC  TSRTC  RTC  Bifercation  Sambashiva Rao  

Other Articles