rtc bifurcation process completed

The bus gets cut into two

bus' gets cut into two, rtc bifurcation process completed "apsrtc, division, tsrtc, Andhra Pradesh rtc, Telangana rtc

The process of dividing the surface transport behemoth RTC has been completed. The RTC has been divided into the Andhra Pradesh and Telangana units

ఆర్టీసీ విభజన కసరత్తు కోలిక్కి.. ఆస్తుల మినహా అన్నీ పూర్తి..

Posted: 04/28/2015 09:11 PM IST
The bus gets cut into two

ఆర్టీసీ విభజన ప్రక్రియ వేగం పుంజుకుంది. సమైక్య రాష్ట్రంలో ప్రగతి చక్రానికి చిహ్నంగా.. ఏపీఎస్ ఆర్టీసీగా ఉన్న ఈ సంస్థను ఇప్పుడు రెండుగా విభజించారు. మే 14వ తేదీ నుంచి తెలంగాణ ఆర్జీసీ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీగా విడివిడిగా రెండు రాష్ట్రాలకు ఆర్టీసీ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ప్రధానంగా రెండు రాష్ట్రాలకు అధికారుల విభజన ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యం పూర్తిచేసింది.

దీంతో మే 14వ తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏపీఎస్ ఆర్టీసీ, తెలంగాణకు టీఎస్ ఆర్టీసీగా పనిచేస్తాయి. పరిపాలన విభాగాలకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. బస్ భవన్లో ఎ బ్లాకును ఆంధ్రాకు, బి బ్లాకును తెలంగాణకు కేటాయిస్తూ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆస్తుల విభజన మీద మాత్రం ఇంకా చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఇది కూడా పూర్తైన పక్షంలో ఆర్టీసీ పూర్తిగా విడిపోయినట్లే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : apsrtc  tsrtc  rtc bifurcation  

Other Articles