Lohia Auto sees big potential for e-bikes in AP, Telangana

Lohia auto industries to foray into south india

Lohia Auto sees big potential for e-bikes in AP, Telangana, Lohia Auto Industries to foray into South India, Telangana, Andhra Pradesh, manufacturing and engineering, Lohiya automobiles, Lohia Auto Industries, launch of its e-scooters, e-rickshaws and diesel three wheelers in southern market, ,India ,Andhra Pradesh ,manufacturing and engineering ,automobiles (industry)

Lohia Auto Industries will enter the southern market with the launch of its e-scooters, e-rickshaws and diesel three wheelers in the next couple of months.

తెలుగు రాష్ట్రాలలో త్వరలో లోహియా ఇ-వాహనాలు

Posted: 04/23/2015 05:47 PM IST
Lohia auto industries to foray into south india

రెండు తెలుగు రాష్ట్రాలలో తన వ్యాపారాన్ని విస్తరింపజేసుకుని, విస్తృతం చేసుకునేందుకు లోహియా ఆటో ఇండస్ట్రీస్‌ యోచిస్తోంది. ఈ మేరకు త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన ఇ-స్కూటర్లు, ఇ-రిక్షాలు, డీజిల్‌ ఆటోలు విడుదల చేయబోతోంది. ఇందుకోసం ఈ సంవత్సరం 20 మంది డీలర్లను నియమించబోతున్నట్టు కంపెనీ సిఇవో ఆయుష్‌ లోహియా మీడియా సమావేశంలో వెల్లడించారు. త్వరలోనే ఎపి, తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలన్నిటిలో తమ ఉత్పత్తులు విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది. దక్షిణ భారతదేశం మొత్తానికి హైదరాబాద్‌నే కేంద్రంంగా చేయాలని కూడా కంపెనీ భావిస్తోంది. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించిన రాయితీలతో దేశంలో విద్యుత్‌ శక్తితో నడిచే ద్విచక్ర, త్రిచక్రవాహనాలకు మంచి డి మాండ్‌ ఉంటుందని లోహియా చెప్పారు.

ఇ-రిక్షాల అమ్మకానికి అవసరమైన అనుమతుల కోసం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు దరఖాస్తు చేసినట్టు తెలిపారు. డిమాండ్‌ను బట్టి ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌లోని ఉత్పత్తి యూనిట్‌తో పాటు ఎపి, తెలంగాణతో సహా దక్షిణాదిన సైతం ఉత్పత్తి యూనిట్‌ ఏర్పాటు చేసే విషయం పరిశీలిస్తామన్నారు. పూర్తిగా దేశీయ సాంకేతిక పరి.జ్ఞానంతో అభివృద్ధి చేసిన తమ విద్యుత్‌ వాహనాలు ఒకసారి చార్జి చేస్తే రెండు యూనిట్ల విద్యుత్‌తో 70-80 కిలోమీటర్ల మైలేజి ఇస్తాయన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Andhra Pradesh  manufacturing and engineering  Lohiya automobiles  

Other Articles