baby | Donation | Britan | 100min

A 100 min baby organ donar created newrecord in organ donation

baby, organs, donatio, 100min,britan

His tiny body was only strong enough to cling to life for a matter of minutes. Jess Evans and Mike Houlston knew Teddy, their brave baby boy , could never survive, but they were determined for his life to have a true meaning.It was 12 weeks into her pregnancy when Jess was delivered the terrible news – one of the twins she was carrying was seriously ill.

వంద నిమిషాల చిన్నారి అవయవదానం.. హాట్పాఫ్ హాట్సాఫ్

Posted: 04/23/2015 06:23 PM IST
A 100 min baby organ donar created newrecord in organ donation

అవయవ దానం గురించి ఈ మధ్య జనాల్లో కాస్త అవగాహన బాగానే పెరిగింది. అవయవ దానానికి చాలా మంది ముందుకు కూడా వస్తున్నారు. చావు అంచుల్లో ఉండి, జీవించడానికి ఎలాంటి అవకాశం లేని వారి అవయవాలను అవసరమైన వారికి చేర్చి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపేలా చేసేదే అవయవదానం. అయితే తాజాగా బ్రిటన్ లో ఓ చిన్నారి అతి చిన్న వయస్సు గల అవయవ దాతగా మారిన విషయం వెలుగులోకి వచ్చింది.  అయితే చిన్నారి వయసు ఎంతో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవడం మీవంతవుతుంది. ఎందుకంటే కేవలం వంద నిమిషాలు మాత్రమే అవును అక్షరాల వంద నిమిషాలు మాత్రమే. వంద నిమిషాల వయస్సు కలిగిన చిన్నారి ప్రపంచంలోనే అతి చిన్న అవయవదాతగా మారాడు. అసలు ఆ చిన్నారి ఎవరు.. ఆ విశేషాలు ఏంటి అనే విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..

బ్రిటన్‌లో ఓ చిన్నారి ఈ నేల మీద పట్టుమని రెండు గంటలు కూడా గాలిపీల్చలేదు. కానీ అవయవదానం చేసి అపురూపమైన చరిత్ర సృష్టించాడు. అరుదైన వ్యాధితో జన్మించిన ఓ చిట్టితండ్రి వంద నిమిషాలు మాత్రమే బతికాడు. అతడి సమస్య తెలిసిన తల్లిదండ్రులు గుండె దిటవు చేసుకొని చిన్నారి కిడ్నీలు, గుండె కవాటాలు దానం చేశారు. బ్రిటన్‌కు చెందిన జెస్ ఇవాన్స్, మైక్ హౌల్‌స్టన్ దంపతులకు గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన కవల కుమారులు జన్మించారు. వారిలో ఒకరు ఆరోగ్యంగా ఉండగా, మరో బాబు నయం చేయలేని వ్యాధితో జన్మించాడు. కొద్ది నిమిషాలు మాత్రమే బతుకుతాడని వైద్యులు తెలిపారు. తమ చిన్నారి జీవితం చాలా చిన్నదైనా.. అది వృథా కావొద్దని.. తల్లిదండ్రులు ధైర్యం కూడదీసుకొని బాబు అవయవాలు దానం చేశారు. దాంతో బ్రిటన్‌లోనే అత్యంత చిన్న వయసులో అవయవదానం చేసిన చిన్నారిగా ఆ పసివాడు చరిత్రలో నిలిచిపోయాడు. తన అవయవాలతో ఓ నిండు ప్రాణం కాపాడిన తమ బిడ్డ నిజమైన హీరో అని.. అందుకు తాము ఎంతగానో గర్విస్తున్నామని తండ్రి హౌల్‌స్టన్ తెలిపారు.
(Source : http://www.walesonline.co.uk )

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baby  organs  donatio  100min  britan  

Other Articles