Revanth reddy | Telangana | KCR | Mahabubnagar

Reventh reddy slams telangana cm kcr at mahabubnagar meeting

revanth reddy, kcr, mahabubnagar, TDP, TTDP, chandrababu, telangana

Revanth reddy slams telangana cm kcr at mahabubnagar meeting. The ap cm, TDP president chandrababu naidu attend the meeting in mahabubnagar on today. In this meeting reventh reddy attacked on kcr.

కేసీఆర్ నా కళ్లలోకి చూసే దమ్ముందా.. హా

Posted: 04/23/2015 08:04 PM IST
Reventh reddy slams telangana cm kcr at mahabubnagar meeting

టిటిడిపి ఏర్పాటు చేసిన పాలమూరు బహిరంగ సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ నిన్నటి వరకు తెలంగాణ టీడీపీ లేదన్న కేసీఆర్‌ గురువారం పాలమూరుకు కార్యకర్తలు వస్తే కరెంట్‌ కోతలు విధించి... ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా చేయాలని కరెంట్‌ కోత విధించారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంత దిగజారుడుతనం పనికిరాదని ఆయన అన్నారు. పాలమూరు ప్రాంతంలో సుమారు 10 ప్రాంతాల్లో కరెంట్‌ కట్‌ చేశారు. ఎందుకంటే మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీడీపీ సభను చూసి 10 జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలు ఉప్పెనలా ఉప్పొంగుతారని సీఎం కేసీఆర్‌ భయపడి ఈరోజు జిల్లాలో కరెంట్‌ కట్‌ చేయించారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

రాష్ట్రంలో టీడీపీ లేకుండా చేస్తానని ఒకనాడు వైఎస్‌ అంటే 48 గంటలలోపల పావురాల గుట్టలో పావురమై ఎక్కడి పోయారో తెలియదని రేవంత్‌రెడ్డి అన్నారు. అదే విధంగా కేసీఆర్‌ కూడా టీడీపీని ఖాళీ చేస్తానని అన్నారని.... తెలుగుదేశం పార్టీ అంటే ఫామ్‌ హౌస్‌లో కేసీఆర్‌ తాగే మందు సీసా కాదని... ఇది టీడీపీ అని, నాయకులను కొనుక్కోవచ్చునని, కానీ కార్యకర్తలను కొనుక్కోలేవని ఆయన అన్నారు. శాసనసభలో నా కళ్ళలోకి సూటిగా చూసే ధైర్యం కేసీఆర్‌కు ఉందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు బలయ్యారని... అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను కేసీఆర్‌ విస్మరించారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  kcr  mahabubnagar  TDP  TTDP  chandrababu  telangana  

Other Articles