BJP government gives clearance vijayawada kanaka durga temple

Central government gives clearance vijayawada kanaka durga temple

BJP government gives clearance vijayawada kanaka durga temple, Andhra pradesh, vijayawada, MP kesineni nani, DPR, kanaka durga devi temple flyover, 300 crores estimate,

Central government gives clearance for construction of vijayawada kanaka durga temple flyover.

కనక దుర్గమ్మ గుడి వద్ద ఫ్లైఓవర్ కు గ్రీన్ సిగ్నల్..

Posted: 04/16/2015 09:50 PM IST
Central government gives clearance vijayawada kanaka durga temple

విజయవాడ వాసులతో పాటు ఆ దారి గుండా నిత్యం ప్రయాణం చేస్తూ.. అనేక పాట్లు పడుతున్న ప్రయాణికులకు, వాహనదారులకు కేంద్రం ఎట్టకేలకు తీపి కబురును అందించింది. దుర్గగుడి దగ్గర ఫ్లైఓవర్‌ నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రెండో అలైన్‌మెంట్‌ ప్రతిపాదనను ఆమోదిస్తూ ఆర్‌ అండ్‌ బీ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీకి కేంద్రం గురువారం లేఖ రాసింది. ప్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ రూపురేఖలను ఖరారు చేసింది. ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని సమగ్ర ప్రాజెక్టు నివేదిక కోరింది. దీనికి సంబంధించిన వివరాలను విజయవాడ ఎంపీ కేశినేని నాని వెల్లడించారు.

ప్రతిపాదిత ఫై ఓవర్ కుమ్మరిపాలెం నుంచి కార్పొరేషన్‌ కార్యాలయం వెనకవైపు వరకు 2.3 కిలోమీటర్ల పొడవున 4 లైన్ల ఫ్లైఓవర్‌ నిర్మించనున్నారు. దీనికి సుమారు రూ. 300 కోట్ల వ్యయం అవుతుందని రాషట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. డీపీఆర్‌ సమర్థిస్తే వెంటనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం ఆ లేఖలో స్పష్టం చేసింది. దీంతో దీర్ఘకాలంగా తాము విజయవాడలో దుర్గ గుడి వద్ద ట్రాఫిక్ జామ్ లను నిలువరించేందుకు మార్గం సుగమం అయ్యిందని కేశినేని వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijayawada  kanaka durga temple  flyover  andhra pradesh  

Other Articles