less percentage of voting in maa elections | maa elections

Less percentage of voting in maa elections

maa elections, jayasudha pannel, rajendra prasad pannel, movie artist association, maa president elections, rajendra prasad news, jayasudha press meet, artist hema news, nagababu, nagababu rajendra prasad, nagababu press meet, jayasudha updates, actor uttej, actor shivaji raja, actress Hema, maa president elections, maa, movie arts association, shivaji raja, hema

less percentage of voting in movie artists association elections

మందకోడిగా సాగుతున్న ‘మా’ పోలింగ్

Posted: 03/29/2015 12:53 PM IST
Less percentage of voting in maa elections

టాలీవుడ్ చిత్రపరిశ్రమలోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా కోనసాగుతున్నాయి. గతానికి భిన్నంగా ఇద్దరు ప్రముఖ నటుల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఈ ఎన్నికలలో ఓటింగ్ శాతం మందకొడిగా సాగుతుంది. సుమారుగా మరో గంట వ్యవధిలో ఎన్నికలు ముగియనుండగా, ఇప్పటి వరకు కేవలం 371 ఓట్ల మాత్రమే పోలయ్యాయి. అధ్యక్ష పదవికి బరిలో నిలిచిన నటకీరిటి రాజేంద్ర ప్రసాద్, సహజ నటి జయసుధల ఫ్యానల్ సభ్యులను తక్కువ పోలింగ్ శాతం గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది.

పోటీ పడుతున్న రెండు ప్యానళ్లు.. ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినా.. ఇంత తక్కువ సంఖ్యలో ఓట్ల పోలవ్వడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మీడియా విపరీత ప్రచారం.. ఇద్దరు సీనియర్ నటులు అధ్యక్ష పదవికి పోటీ పడటంతో.. ఎన్నికలకు అగ్రనటులు, నటీమణులు దూరంగా వున్నారని సమాచారం. మొత్తం 702 ఓట్లలో కనీసం 60 శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు. కాగా సినిమా ఇండస్ట్రీకి రెండో ఆదివారం సెలవుగా వుండగా, ఆ రోజున ఎన్నికలను నిర్వహించకుండా, నాలుగో ఆదివారం ఎన్నికలను నిర్వహించడం కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి కారణమయ్యిందని పలువురు వాఖ్యానిస్తున్నారు.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajendra prasad pannel  jayasudha pannel  maa president elections  maa  

Other Articles