New Zealand perilously placed 184 runs target before Australia | 62350

New zealand perilously placed 184 runs target before australia

michael clarke, New zealand vs Australia, New zealand versus Australia final, ICC Cricket World Cup 2015 final match, world cup final live updates, cricket world cup final scores, icc cricket world cup finals, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, Australia CWC 2015, New zealand, New zealand CWC 2015, Sports, World Cup Live

Australia bundle out listless New Zealand for 183 in World Cup final

న్యూజీలాండ్ 183 పరుగులకు కట్టడి చేసిన ఆసీస్

Posted: 03/29/2015 11:39 AM IST
New zealand perilously placed 184 runs target before australia

ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటులో రెండు అతిధ్య జట్లు.. దాయాది దేశాల మధ్య జరుగునున్న మహా సంగ్రామంలో న్యూజీలాండ్ ధాటిగా ఆడి భారీ స్కోరు చేయడంలో బొక్కబోర్లా పడింది. తొలిసారిగా ఫైనల్ కు చేరుకున్న న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్లపై ఎనలేని ఒత్తడి నెలకోనడంతో వారు స్వల్ప స్కోరుకే చాపచుట్టేశారు. అసీన్ బౌలర్లను లీగ్ ధశలో ఉతికి ఆరేసిన కివీస్.. ఫైనల్ మ్యాచ్ లో మాత్రం అసీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించడంలో తీవ్రంగా శ్రమపడ్డారు. అసీస్ బౌలర్ల దాటి మెకరిల్లక తప్పతేదు. ప్రపంచకప్ ఫైనల్‌ పోరులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 183 పరుగులకు ఆలౌట్ అయింది.

ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు జాన్సన్, ఫాల్క్‌నర్, స్టార్క్‌లు న్యూజిలాండ్‌ను ఎనిమిది వికెట్లు తీయటం ద్వారా చిన్న స్కోరుకే పరిమితం చేశారు. టేలర్, ఇలియట్‌ల మధ్య వంద పరుగుల భాగస్వామ్యం తప్ప న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో పెద్ద చెప్పుకోదగ్గ అంశం లేదు. సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్‌ను గెలిపించిన ఇలియట్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో కివీస్‌కు కనీసం గౌరవ ప్రదమైన స్కోరును చేయగలిగింది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు మొదటి ఓవర్ నుంచే న్యూజిలాండ్‌ను దెబ్బతీసి చక్రబంధంలో బిగించారు. యార్కర్లు, షార్ట్ పిచ్ బంతులు, స్లో బాల్స్‌తో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లను కోలుకోనివ్వకుండా చేశారు.

33 ఓవర్లకే ఓపెనర్లు అవుటవ్వడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది న్యూజీలాండ్. ఆ తరువాత వచ్చిన విలియమ్ సన్ కూడా నిలదొక్కుకోకుండా వికెట్ ను జార విడుచుకున్నాడు. మధ్యలో కాసేపు ఇలియట్, టేలర్ ఆచితూడి ఆడి వంద పరుగుల భాగస్వామ్యం సాధించడంతో న్యూజీలాండ్ స్కోరు బోర్డు కాస్త ముందుకు నడిపించారు. విలియమ్‌సన్, గప్తిల్, అండర్‌సన్‌లు కూడా రాణించలేకపోవడంతో న్యూజిలాండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్లలో ఇలియట్ 83 పరుగులు చేయగా, టేలర్ 40 పరుగులు సాధించాడు. కెప్టెన్ మెక్ కలమ్ సహా అండర్సన్, రోంచ్, హెన్నీలు డకౌట్ అయ్యారు. స్ట్కార్, జాన్సన్, పాల్కనర్ చెరో మూడు విక్కెట్లు తీయగా, స్ట్కార్ రెండు, మాక్స్ వెల్ ఒక్క వికెట్ తీశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  New zealand  Australia  

Other Articles