New Zealand strike early, Finch departs in World Cup final

New zealand strike early finch departs in world cup final

michael clarke, New zealand vs Australia, New zealand versus Australia final, ICC Cricket World Cup 2015 final match, world cup final live updates, cricket world cup final scores, icc cricket world cup finals, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, Australia CWC 2015, New zealand, New zealand CWC 2015, Sports, World Cup Live

After getting bowled out for a below-par total of 183, New Zealand struck back without wasting much time as Trent Boult dismissed Aaron Finch in the second over at the Melbourne Cricket Ground on Sunday.

అసీస్ ను ధీటుగానే కట్టడి చేస్తున్న న్యూజీలాండ్, ఫించ్ ఔట్

Posted: 03/29/2015 01:47 PM IST
New zealand strike early finch departs in world cup final

ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటులో రెండు అతిధ్య జట్ల మధ్య మెల్ బోర్న్ వేదికగా జరుగునున్న జగజ్జేత పోరులో అసీస్ తొలి వికెట్ కోల్పోయింది. న్యూజీలాండ్ భారీ స్కోరు చేయకుండా నియంత్రించడంలో సక్సెస్ సాధించిన అసీస్.. కూడా బ్యాటింగ్ లో ఒత్తడిని ఎదుర్కోంటోంది. బౌల్ట్ వేసిన రెండో ఓవర్‌లో ఫించ్ బౌలర్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరగటంతో 2 పరుగుల స్కోరు వద్ద ఆస్ట్రేలియా మొదటి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ వేసిన మూడో బంతిని ప్రమాదకరమైన రీతిలో ఆడిన వార్నర్ సింగిల్ తీయటంతో ఫేస్ చేయటం ఫించ్ వంతైంది. వికెట్ ముందు పడి రైజ్ అవుతున్న బంతిని డ్రైవ్ చేసే ప్రయత్నంలో బ్యాట్ ఎడ్జ్ తాకటంతో బంతి బౌలర్ చేతిలో పడింది. ఫించ్ పరుగులేమి చేయకపోవటం గమనార్హం. మంచి ఫామ్ లో వుండి టిమిండియాతో జరిగిన సెమీస్ లో అసీస్ గెలుపుకు తన సెంచరీతో బాటలు వేసిన స్మిత్ బ్యాటింగ్‌కు వచ్చాడు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన న్యూజీలాండ్ నిర్ణీత ఓవర్లలో కేవలం 183 పరుగులు మాత్రమే చేసింది. అసీస్ బౌలర్ల ధాటికి గజగజలాడిన కివీస్.. అంతకు మించిన ఒత్తడితో వరుసగా విక్కెట్లను కోల్పోయారు. ఇలియట్ , టేలర్ మినహా ఎవరు రాణించలేక పోవడంతో కేవలం 183 పరుగులకే న్యూజీలాండ్ చాపచుట్టేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  New zealand  Australia  

Other Articles