ఉద్యోగం ఇప్పిస్తారని నమ్మబలికి.. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు రాజకీయ ప్రబుద్దులకు తగిన శాస్తి జరిగింది. వారితో పాటు నేరానికి సహకరించిన మరో ముగ్గురికి కూడా పదేళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పను వెలువరించింది. ఒడిశాలోని బిజ్జు జనతా దళ్ రాష్ట్ర నాయకుడు మహేష్ అగర్వాల్, ఒడిశా రాష్ట్ర మాజీ మంత్రి బిజయ్ రంజన్ సింగ్ బిరిహ మేనల్లుడు కునాల్ సింగ్ బిరిహ, మరొ బీజేడి నాయకుడు బిజయ్ సంజన్ అగర్వాల్ లకు న్యాయస్థానం పది సంవత్సరాల జైలు శిక్షను విధించింది. వీరితో పాటు దళిత యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి సహకరించిన దోషులు పింటు ప్రధాన్, కమలేష్ శ్రీవత్సవ్, గుణనిధిలకు కూడా న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఆరేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై ఇవాళ న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
ఒడిశాలోని పిక్మల్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల దళిత యువతి.. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని చేస్తున్న ప్రయత్నాలు తెలుసుకుని. తన పలుకుబడితో ఉధ్యోగం ఇప్పిస్తామని నమ్మబలికిన బీజేడి రాష్ట్ర నాయకుడు మహేష్ అగర్వాల్ నమ్మబలికాడు. 2009 మార్చి 10న ప్రభుత్వ బ్లాక్ కార్యాలయం వద్ద ప్రభుత్వ ఉద్యోగాల విషయమై విచారిస్తున్న యువతిని పిలుచుకుని వెళ్లి తనకు చెందిన ఓ గోడౌన్లో నిర్బంధించారు. తరువాత తన స్నేహితులను పిలిచిన మహేష్ అగర్వాల్.. వారితో కలసి దళిత యువతిపై అదే పనిగా పదే పదే అత్యాచారం జరిపారు. విషయం బయటకు తెలిస్తే ప్రాణాలు తీస్తామని ఆమెను బెదిరించారు.
వారి బెదిరింపులకు తలోగ్గని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చెసింది. దీంతో వారిపై సామూహిక అత్యాచారం సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి మీద సామూహిక అత్యాచారం జరిగిందని వైద్యులు నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో పార్టీ నాయకులను కాపాడుకునేందుకు ఆ పార్టీకి చెందిన నేతలు ఒత్తిడి చేసినా.. అప్పట్లో సంచలనమైన ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు మాత్రం ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కేసు నమోదు చేసి.. నిందితులను అదుపుతోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు.. బార్గార్ల్ పట్టణంలోని జిల్లా అడిషనల్ సెషన్స్ న్యాయస్థానంలో కేసు విచారణ జరిగింది. జిల్లా జడ్జ్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జాహీర్ అహమ్మద్ నిందితులు నేరం చేశారని, సాక్షాధారాలతో రుజువు కావడంతో న్యాయస్థానం వారికి పదేళ్లు జైలు శిక్షను విధించింది. కోర్టు తీర్పుపై స్పందించిన బాధితురాలు తనకు న్యాయం జరిగిందని, ఇక ముందు రాజకీయ పలుకుబడితో ఏమైనా చేస్తాం అనే వారికి ఇది గుణపాఠం అని పేర్కొంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
May 28 | పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేందుకు స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధీగా ఉండాల్సిన ఐఏెఎస్ అధికారులు కూడా నాయకులను మించిపోతున్నారని... Read more
May 28 | కన్న కొడుకు సక్రమమైన మార్గంలో నడవాలని ఏ తల్తైనా కోరుకుంటోంది. అదే కొడుకు తెలిసి.. చేసినా తెలియక చేసినా కొడుకును ఓ వైపు మందలిస్తూనే.. మరోవైపు తన కోడుకును వెనుకేసుకొస్తోంది. అమెది మాతృ హృదయం.... Read more
May 28 | కాలం మారింది.. కాలంతోపాటు మనుషులు కూడా మారుతున్నారు. సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పదిమందిలో కొత్తగా కనిపించాలని అనుకోవడమే కాదు.. విభిన్నంగా అలోచించి జీవితంలో... Read more
May 28 | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి... Read more
May 27 | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు వృద్దనేత ఓం ప్రకాశ్ చౌతాలా మరోమారు కారాగారవాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే ఆయన ఉపాధ్యయుల అక్రమ నియామకాల కేసులో జైలు శిక్షను అనుభవించి.. విడుదలయ్యారు.... Read more