Fire accident in hyderabad as gas cylinder blast

fire accident in hyderabad, fire accident in nampally, fire accident in bazarghat, gas cylinder blast in hyderabad, gas cylinder blast in nampally, gas cylinder blast in bazarghat, gas cylinder blast case, people fear run as gas cylinder blast in hyderabad,

fire accident in hyderabad as gas cylinder blast occured in nampally bazarghat on sunday

హైదరాబాద్ లో అగ్నిప్రమాదం.. కార్ల షెడ్ లో పేలిన గ్యాస్ సిలిండర్

Posted: 03/15/2015 06:43 PM IST
Fire accident in hyderabad as gas cylinder blast

హైదరాబాద్ నాంపల్లిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కార్ల షెడ్ లో సిలిండర్ పేలి భారీగా మంటలు వ్యాపించిన ఘటన ఆదివారం నగరంలో కలకలం సృష్టించింది. ఈ సంఘటన నాంపల్లిలోని బజార్ఘాట్ లో చోటుచేసుకుంది. వివరాలు... నాంపల్లి బజార్ఘాట్లో ఓ కార్ల షెడ్ లో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు కారణంగా భారీగా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

గ్యాస్ సిలిండర్ పేలుడుతో భారీగా శబ్ధం రావడంతో ప్రజలు భయందోళనలకు గురయ్యారు. .నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో ఘటనాస్థలానికి 20 వాటర్ ట్యాంకులను తరలించారు. నాంపల్లి- మాసబ్ ట్యాంక్ మధ్య భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి పర్యవేక్షించారు. ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి ప్రాంతంలో కరెంట్ సరఫరా నిలిపివేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gas cylinder blast  nampally bazarghat  hyderabad  

Other Articles