Prathipati pulla rao tables ap agriculture budget

prathipati pulla rao tables ap agriculture budget, andhra Pradesh agriculture budget, ap agriculture minister prathipati pulla rao, animal husbandry, horticulture, ap cm chandra babu,

prathipati pulla rao tables ap agriculture budget in andhra Pradesh assembly

అన్నదాత సంక్షేమంతోనే రాష్ట్ర ప్రగతి.. నవ్యాంధ్ర కీర్తి..

Posted: 03/13/2015 03:33 PM IST
Prathipati pulla rao tables ap agriculture budget

అన్నదాతల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వార్షిక సంవత్సరానికి .14 వేల 184 కోట్ల రూపాయలతో వ్యవసాయ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అన్నదాల మొదటి దశ రుణమాఫీ కింద 40 లక్షల 50 వేల రైతులకు 4 వేల 689 కోట్ల రూపాలయలను ఖర్చు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది అదే తరహాలో రెండో దశ రైతన్నలకు వర్తింపును కోనసాగించింది. లోకానికి వెలుగు నిచ్చేది సూర్యుడయితే.. ప్రజలకు తిండిపెట్టేది బతికిస్తున్నది పచ్చ సూర్యుడు రైతు అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. అన్నదాత సంక్షేమానాకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2015-16ను శాసనసభలో ఆయన ఇవాళ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాటాడుతూ.. ప్రతికూల వాతావణం వ్యవసాయం రంగానికి పెద్ద సమస్యగా మారిందన్నారు. తగినంత మౌలిక సదుపాయాలు లేని కారణంగా రైతులు వారి పంట ఉత్పత్తులను తక్కువగా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. అవరోధాలను అన్నింటినీ తొలగించి అన్నదాతలకు అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్నదాతల ముఖాల్లో వెలుగు చూసేందుకు తమ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్నారన్నారు.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2015-16లో పశుసంవర్ధక శాఖకు 672.73 కోట్లు కేటాయించారు. వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి 124.48 కోట్లు కేటాయించినట్టు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. మత్స్యశాఖకు రూ. 187 కోట్లు కేటాయించారు.  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2015-16లో ఉద్యాన శాఖకు రూ. 210 కోట్లు కేటాయించారు. ఉద్యాన అభివృద్ధి మిషన్ కు రూ. 100 కోట్లు కేటాయించినట్టు వ్యవసాయ మంత్రి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. వైఎస్ఆర్ హార్టీకల్చర్ రూ. 53.01 కోట్లు.. బిందు, తుంపర్ల సేద్యానికి రూ.144 కేటాయించారు. ఉద్యావన పంటలను ఎక్కువ విస్తీర్ణంలో పండించేందుకు ప్రోత్సాహం అందిస్తామని మంత్రి హామీయిచ్చారు. శీతల గిడ్డంగులు, గ్రీన్ హౌస్ లు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యావన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు.

వ్యవసాయ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలు:

* 2015-16 వ్యవసాయ బడ్జెట్ అంచనా రూ.14,184 కోట్లు
* మొదటి దశ రుణమాఫీకి 40.50 లక్షల ఖాతాలకు రూ.4,689 కోట్లు ఖర్చు చేశాం
* రెండో దశ కింద 42.16 లక్షల ఖాతాలకు వర్తింపు
* ప్రయివేటు భాగస్వామ్యంతో ప్రాథమిక రంగ మిషన్
* ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం పెంపు రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు
* భూసార పటిష్టతకు రూ.905 కోట్లు
* విత్తన మార్పిడికి రూ.80 కోట్లు
* ఎస్సీ, ఎస్టీ రైతులకు సబ్సిడీ 50 శాతం నుంచి 70 శాతానికి పెంపు
* యాంత్రీకరణకు రూ.141.63 కోట్లు
* శాటిలైట్ ఇమేజనరీకి రూ.81.21 కోట్లు
* పొలం బడి కార్యక్రమానికి రూ.1.46 కోట్లు
* వడ్డీలేని రుణాల కోసం రూ.172 కోట్లు
* పావలా వడ్డీకి రూ.10 కోట్లు
* రాష్ట్ర కృషి వికాస్ యోజనకు రూ.513.21 కోట్లు
* ఎన్టీ రంగా విశ్వవిద్యాలయానికి రూ.367.73 కోట్లు
* ఉద్యాన శాఖకు రూ.210 కోట్లు
* ఉద్యాన అభివృద్ధి మిషన్కు రూ.100 కోట్లు
* క్షేత్రస్థాయి నీటి నిర్వహణకు రూ.144 కోట్లు
* పట్టు పరిశ్రమకు రూ.93.61 కోట్లు
* వైఎస్ఆర్ హార్టీ కల్చర్ యూనివర్శిటీకి రూ.53.01 కోట్లు
* పశు సంవర్థక శాఖకు రూ.672.73 కోట్లు
* ఉపాధి హామీకి నిధులు పెంపు
* వ్యవసాయరంగంలో ప్రయివేటుకు పెద్దపీట
* త్వరలో వ్యవసాయ విస్తరణాధికారులుగా 6,354 మంది నియామకం
* ఉచిత విద్యుత్కు రూ.3,000 కోట్లు కేటాయింపు...గత ఏడాది కన్నా రూ.188 కోట్లు తగ్గింపు
* హుద్హుద్ తుపానులో నష్టపోయిన రైతులకు రూ.140 కోట్లు
* వెంకటేశ్వర పశువైద్య కళాశాలకు రూ.124 కోట్లు
* మత్స్యశాఖకు రూ.187 కోట్లు
* భూసార పటిష్టత మ్యాపుల తయారీ
* గత ఏడాదితో పోలిస్తే తగ్గిన వడ్డీ రాయితీ
* గతేడాది రూ.230 కోట్లు కేటాయింపు, ఈసారి రూ.182 కోట్లు
* సహకార శాఖకు రూ.7.88 కోట్లు
* సౌర విద్యుత్ తో నడిచే 10వేలు పంపుసెట్లు
* రైతులు మెరుగైన ధరలు పొందేందుకు చర్యలు


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prathipati pulla rao  Agri Budget-2015  Andhra pradesh  

Other Articles