Ib alerts govt over dawood ibrahim shadow on lottery fraud

Dawood Ibrahim, lottery fraud,ib, pakistan, inetlligence beauro, india, financial

As confidence tricks go, this one is not novel. But the sheer amount of money involved and the trail leading to Pakistan - possibly to a certain Dawood Ibrahim - make it a thriller.

దావుద్ అదుపులో భారత లాటరీలు.. హెచ్చరించిన ఐబి

Posted: 03/13/2015 04:04 PM IST
Ib alerts govt over dawood ibrahim shadow on lottery fraud

ముంబాయి మాఫియా డాన్ దావుద్ కోసం చాలా సంవత్సరాలుగా భారత్ వెతుకుతోంది. భారత్ లో ఉండి, దురాగతాలకు పాల్పడి విదేశీ శక్తులకు సహకరించినందుకు పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. కానీ ఇంత వరకు అతని ఆచూకీ మాత్రం కనుక్కోలేకపోయారు. దావుడ్ ఇబ్రహీం భారత్ లో చేస్తున్న మరో కొత్త వ్యాపారం తాజాగా వెలుగు చూస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థను తన కనుసనలతో శాసించాలనుకున్న దావుద్ కల, ప్రభుత్వానికి తెలిసిపోయింది. తాజాగా భారత్ లో చాలా వరకు లాటరీలు దావుద్ కనుసనల్లోనే నడుస్తున్నాయని ఐబి తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకు అవకాశం ఉందని కూడా ఐబి కేంద్రానిరి హెచ్చరికలు జారీ చేసింది.

మీ ఫోన్ నెంబర్‌కు బంపర్ బహుమతి తగిలింది. వాటిని పంపించేందుకు ప్రాసెసింగ్ ఫీజు కింద ఇంత మొత్తాన్ని ఫలానా బ్యాంకులోని ఫలానా ఖాతాలో జమచేయండి’ అంటూ భారతీయ ఏజెంట్లు అమాయక ప్రజలను బుట్టలో వేస్తారు. ఆఫర్‌చేసే లాటరీ బంపర్ బహుమతి మొత్తాన్నిబట్టి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు గుంజుతారు. బ్యాంకు ఖాతా నెంబర్ల ద్వారానే లావాదేవీలు జరుగుతున్నందున మోసం జరిగే అవకాశం ఉండదని ప్రజలు భ్రమపడతారు. అప్పటికీ అనుమానపడే వారిని ఏజెంట్లు కొంత డబ్బును కూడా పంపించి నిజంగా లాటరీ తగిలినట్టు నమ్మిస్తారు. వారు ప్రాసెసింగ్ ఫీజు కింద అడిగిన మొత్తాన్ని జమ చేసిన మరుక్షణంలోనే విత్ డ్రా చేస్తారు. ఇలా దేశ వ్యాప్తంగా ఈ వ్యాపారం సాగుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రజల నుండి సేకరించిన  4,193 కోట్ల రూపాయలు ఇప్పటికే దేశ సరిహద్దులు దాటి పాకిస్థాన్‌కు చేరిందని, దీని వెనుక అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం హస్తం ఉందని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో  ఇటీవల కేంద్ర హోం శాఖకు సమర్పించిన ఓ నివేదికలో వెల్లడించింది. అయితే అధికారికంగా భారత ప్రభుత్వంగానీ, ఐబీగానీ ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. లాటరీల కుంభకోణాలకు సంబంధించి 4,193 కోట్ల రూపాయల సొమ్ము ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లోని ఎస్.బి.ఐ, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్,  యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా మొత్తం 1,162 బ్యాంక్‌ల బ్రాంచిల ద్వారా విత్ డ్రా చేసి పాకిస్థాన్ తరలించారు. దావూద్ ఇబ్రహీంకు చెందిన హవాల నెట్‌వర్క్ సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ గుండా ఈ సొమ్మును పాకిస్థాన్ చేర్చింది.  అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలను గుర్తించి, వాటి నుంచి నగదు విత్‌ డ్రాలను తక్షణమే ఆపేలా చర్యలు తీసుకోవాల్సిందిగాఆర్థిక శాఖను ఐబీ కోరింది. లాటరీల నిర్వహన కొన్ని ఫోన్ కాంటాక్ట్ ద్వారా జరిగాయని, ఫోన్ నెంబర్ వివరాల ద్వారా కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళుతున్నట్టు హోం శాఖకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నాయి.  మరి దావుద్ భారత్ పై ఆర్థిక దాడిని భారత ప్రభుత్వం ఎలా కట్టడి చేస్తుందో చూడాలి.
(source- sakshi, sayitandseeit.in)

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dawood Ibrahim  lottery fraud  ib  pakistan  inetlligence beauro  india  financial  

Other Articles