Reaffirming its commitment to abrogation of article 370 in jammu and kashmir

jammukashmir, 370 article, rss, mohanbhagath, modi

Reaffirming its commitment to abrogation of Article 370 in Jammu and Kashmir, RSS today batted for the success of the "novel experiment" in the state, where BJP has formed a government for the first time with PDP, saying the rift between the two were only "teething problems".

ఆర్టికల్ 370 లో ఎలాంటి మార్పు ఉండదు: ఆర్ఎస్ఎస్

Posted: 03/13/2015 03:27 PM IST
Reaffirming its commitment to abrogation of article 370 in jammu and kashmir

ఆర్ఎస్ఎస్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలను చేసింది. జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 పై ఎలాంటి మార్పు ఉండబోదు అని తెలిపింది. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా జమ్ము కాశ్మీర్ లో పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆర్టికల్ 370 ని విమరమించుకోవడం కుదరదు అని తెలిపింది. అయితే ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ప్రధాని మోదీ జమ్ము కాశ్మీర్ లో 370ఆర్టికల్ ను విరమించుకోవడం గురించ అధికారంలోకి వస్తే పరిశీలిస్తామని, జమ్ము కాశ్మీర్ అన్నిరంగాల్లో అభివృద్ది చెందడానికి కేంద్రం నుండి కావలసినంత సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం మాత్రం 370 ఆర్టికల్ కు సంబందించి ఎలాంటి మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. అయితే కేంద్రం ఆధీనంలో ఉండే రాజ్యాంగపర అంశంపై ఓ మతతత్వ సంస్థ ఎలా ప్రకటన చేస్తుందని కొందరు విమర్శిస్తున్నారు.

భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి సంసృతిపరంగా, దేశీయంగా, డిఎన్ఎ పరంగా హిందువే అంటూ తాజాగా ప్రకటన చేసింది. గతంలోనూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కూడా భారత్ లో పుట్టిన ప్రతి వ్యక్తి హిందువేనని, కానీ కొన్ని కారణాల వల్ల కొందరు వ్యక్తులు మతం మార్చుకున్నారని ఇప్పటికి ఓ డజన్ సార్లు అని ఉంటారు. తాజాగా నాగ్ పూర్ లో జరనున్న ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభకు పలువురు ఆర్ఎస్ఎస్ ముఖ్యనేతలు, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammukashmir  370 article  rss  mohanbhagath  modi  

Other Articles