Kashmir government letter to centre on musarat alam release

kashmir government letter to centre on musarat alam release., seperatist musarat alam, Jammu and Kashmir seperatist, Anti indian activist Musarat alam, Musarat Alam, separatist leader, Kashmir government, central government, J and K government letter on musarat alam release, nationwide agitations on release of musarat alam, J K government backs Musarat alam

kashmir government letter to centre on musarat alam release.

దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబిక్కినా.. వెనకేసుకోచ్చిన ప్రభుత్వం..

Posted: 03/12/2015 04:33 PM IST
Kashmir government letter to centre on musarat alam release

అతని నరనరాన భారత్ దేశ వ్యతిరేకత ప్రవహిస్తున్నా.. అతని విడుదల చేయడమే కాకుండా ఆ వేర్పాటు వాదని వెనకేసుకోచ్చింది జమ్మూకాశ్మీర్ లో కొలువుదీరిన ముప్తీ మహ్మద్ సయ్యాద్ కొత్త ప్రభుత్వం. భారత్ జాతిని ద్రోహం చేసేందుకు ఒడిగట్టిన ఈ వేర్పాటు వాది చర్యలు తెలుసుకున్న దేశపౌరులు అతడి విడుదలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టినా.. ముఫ్తీ మహ్మద్ సయ్యూద్ ప్రభుత్వం మాత్రం నిసిగ్గుగా అతనిడిని వెనకేసుకు వస్తోంది. మసారత్ అలంను నిర్భందించి ఉంచడానికి తమ ప్రభుత్వానికి ఎలాంటి కారణాలు కనిపించలేదని కాశ్మీర్ ప్రభుత్వం పేర్కోంది. అందుకే అతడిని విడుదల చేశామని స్పష్టం చేసింది. వేర్పాటు వాది మసారత్ అలం విడుదలపై కేంద్ర హోంశాఖ రాసిన లేఖకు కాశ్మీర్ ప్రభుత్వం గురువారం పైవిధంగా స్పందిస్తూ కేంద్రానికి ప్రత్యుత్తరం రాసింది.

వేర్పాటు వాది మసారత్ అలం విడుదలపై పార్లమెంట్ ఉభయ సభలను ప్రతిపక్షాలు స్తంభింపచేయడంతో.. అతని విడుదలపై జవాబు కోరుతూ.. కేంద్రం జమ్మూకాశ్మీర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై స్పందించిన జమ్మూ ప్రభుత్వం అసలు ముసారత్ అలంను ఎందుకు నిర్భందించాలని ఎదురు ప్రశ్నించే స్థాయిలో జవాబునిచ్చింది. కాశ్మీర్ లో భారత్ కు వ్యతిరేకంగా ఉద్యమాలను నడిపిన ఆలంను వెనకేసుకువచ్చింది. ప్రభుత్వం చెబుతున్నదే నిజమైన పక్షంలో అసలు ఇన్నాళ్ల పాటు అతను ఎందుకు బంధీగా వున్నాడు. అప్పుడే అతని విడుదలకు ఎందుకు పీడీపీ పార్టీ ప్రయత్నాలు చేయలేదు. అతను తప్పులే చేయని సచ్చీలుడైతే న్యాయస్థానాలను ఆశ్రయించి.. అతని విడుదలకు ఎందుకు ప్రయత్నించలేదో ఆ పార్టీకి, ప్రభుత్వానికే తెలియాలి.

భారత మాత పురిటి గడ్డపై పుట్టిన కలుపు మొక్కలను వేరివేయాల్సింది పోయి పెంచి ఫోషించడం ఎంత వరకు సబబన్న ప్రశ్నలు దేశ ప్రజలనుంచి వినబడుతున్నాయి.  పీడీపీకి చెందిన ముఫ్తీ మహమద్ సయిద్ కాశ్మీర్ సీఎంగా పాలన పగ్గాలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో ఎన్నికలు శాంతయుతంగా జరిగాయంటే అందుకు కారణం తీవ్రవాదులు, పొరుగు దేశమైన పాకిస్థాన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరోమారు ఆలంను వెనకేసుకు వచ్చి మరో సారి విమర్శల పాలవుతున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Musarat Alam  separatist leader  Kashmir government  central government  

Other Articles